vinayaka chavithi celebrations, temples throng by devotees

Ganesh chavithi celebrations across india

vinayaka chavithi celebrations, temples throng by devotees, gahesh chaturthi, ganesh chavithi celebrations, hindus, historical temples,

Ganesh Chaturthi is the festival celebrated by Hindus across the world in honour of Lord Ganesha, historical temples and mandaps throng by devotees

దేశవ్యాప్తంగా భక్తి శ్రద్దలతో వినాయక చవితి వేడుకలు..

Posted: 09/05/2016 08:09 AM IST
Ganesh chavithi celebrations across india

వినాయక చవితి వేడుకలను దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరపుకుంటున్నారు. ఉదయాన్నే భక్తులు పత్రితో ఇళ్లలో వినాయకుడిని స్తాపించి పూజలు నిర్వహిస్తున్నారు. మరికోందరు ఉదయాన్నే స్థానికంగా గల దేవాలయాల్లో గణపతి దేవుడికి భక్తితో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా దేవాలయాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దేశంలోని అన్ని ప్రముఖ నగరాల్లో వినాయక చవితి శోభ సంతకించుకుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఘనంగా వినాయక చవితి వేడుకలు జరుపుకుంటున్నారు.

తెల్లవారుజాము నుంచే వినాయక ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఖైరతాబాద్‌లో ఈ సారి 58 అడుగుల వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గవర్నర్ దంపతులు ఇక్కడ తొలిపూజ చేయనున్నారు. తాపేశ్వం నుంచి ప్రతి ఏటా వచ్చినట్లుగానే ఈ ఏడాది కూడా గణేశుడికి లడ్డూ మహాప్రసాదం అందింది. తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం సురుచి ఫుడ్స్.. ఖైరతాబాద్ గణేశుడికి 500 కిలోల లడ్డూను తయారుచేసింది.

విజయవాడలో 72 అడుగుల డుండీ గణేషుడిని ఏర్పాటుచేశారు. విశాఖలోని గాజువాకలో 78 అడుగుల వినాయక విగ్రహాన్ని ఏర్పాటుచేయడం విశేషం. కానిపాక వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు ప్రరాంభమయ్యాయి. ఈ ఉత్సవాలు 21 రోజుల పాటు జరుగుతాయి. రద్దీ దృష్ట్యా ఆలయంలో ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు. శ్రీశైల ఆలయంలో ఈ నెల 14 వరకు గణేష్ నవరాత్రీ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vinayaka chavithi  celebrations  telugu states  Temples  devotees  

Other Articles