ఇంక్రెడబుల్ ఇండియా ప్రచారకర్త గా నరేంద్ర మోదీ | PM Modi to be Incredible India's brand ambassador

Pm modi to be incredible india s brand ambassador

Modi Incredible India, Modi Incredible India Ad, New Ambassador for Incredible India, Incredible India New Brand Ambassador,

PM Modi to be Incredible India's brand ambassador.

వావ్... అమీర్ ఖాన్ రోల్ లో నరేంద్ర మోదీ

Posted: 08/20/2016 12:08 PM IST
Pm modi to be incredible india s brand ambassador

బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ఇంతకాలం పోషించిన పాత్రలో ఇకపై ప్రధాని నరేంద్ర మోదీ కనిపించనున్నారు. సినిమా కోసం కాదు... బ్రాండ్ అంబాసిడర్ గా. ప్రతిష్టాత్మక ఇన్ క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ గా మోదీని నియమించారు. ‘ఇన్ క్రెడిబుల్ ఇండియా’ ప్రచార కార్యక్రమాలను నిర్వహించే కేంద్ర సాంస్కృతిక, టూరిజం మంత్రిత్వ శాఖ పలు చర్చల అనంతరం కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా మోదీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

ఇన్ క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ గా గతంలో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ వ్యవహరించిన విషయం తెలిసిందే. ‘భారత్ ను విడిచిపోదామని మా ఆవిడ అంది' అంటూ అమీర్ ఖాన్ చేసిన మత అసహనం వ్యాఖ్యలు చేయటం, వివాదం ఎక్కువ కావటంతో ఆయనను తొలగించడం తెలిసిందే. ఆ తర్వాత 'ఇన్ క్రెడిబుల్ ఇండియా’ బ్రాండ్ అంబాసిడర్ గా అమీర్ స్థానే కొత్త వారిని నియమించేందుకు ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ సహా పలువురి ప్రముఖుల పేర్లు తెరపైకి వచ్చాయి.

అయితే చివరికి మోదీ పేరునే ఫైనల్ చేసింది కేంద్రం. ‘ఇన్ క్రెడిబుల్ ఇండియా’కు బెస్ట్ ఫేస్ ప్రధాని నరేంద్ర మోదీయేనని, ఎందుకంటే, ప్రపంచ వ్యాప్తంగా పర్యటిస్తున్న ఆయన భారత్ గురించి విశ్వవ్యాప్తంగా తెలియజెప్పేందుకు అవకాశముంటుందని కేంద్ర మంత్రి మహేష్ శర్మ పేర్కొన్నారు. త్వరలో ఆయనతో రూపొందించబోయే యాడ్ ఫిల్మ్ కు సంబంధించిన కాన్సెప్ట్ ల విషయమై సదరు మంత్రిత్వ శాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Narendra Modi  Incredible India  Brand Ambassador  

Other Articles