drunk and driven cases send direct to jail

New rules comes into force boozers alert

hyderabad traffic police, drunk and drive, fine, court, jail, new rules for drunk and drive, hyderabad accidents, hyderabad boozers, boozers alert, hyderabad boozers alert, hyderabad drunkers, drunkers alert

boozers caught in drunk and driven cases, hereafter will be sent directly to jail, new rules comes into force

మందుబాబులూ పారాహుషార్.. అమల్లోకి కొత్త నిబంధనలు

Posted: 08/03/2016 03:28 PM IST
New rules comes into force boozers alert

మందుబాబులూ పారాహుషార్... పీకల వరకు మందు లాగించి బైక్ వేసుకుని రయ్య్ మంటూ ఇళ్లకు చేరుకునే వారు చాలామందే. అయితే మద్యలో పోలిస్ డ్రంక్ అండ్ డ్రవ్ చెక్ లలో దోరికితే పోలీసులు చాలనాలు, లేదా కోర్టుకు పంపేవారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసుల్లో అనేక మంది దోరికిపోతున్నా.. కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. అయితే ఇలా చేసిన వారు తమ ప్రాణాలకే కాదు ఎదుటివారికి కూడా ప్రమాదకంగా మారుతున్నారు. బంజారాహిల్స్ లో చిల్లీస్ రెస్టారెంట్ వద్ద జరిగిన చిన్నారి రమ్య, అమె తాత, బాబాయ్ మరణించిన ఘటనే ఇందుకు ఉదాహరణ. దీంతో.. హైదరాబాద్ లో మాత్రం కొత్త నిబంధలనలు అమల్లోకి తీసుకువస్తున్నారు నగర ట్రాఫిక్ పోలీసులు.ఇన్నాళ్లు చెల్లింది కానీ ఇక నుంచి మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారో మీ పని అయిపోనట్టే. ఎందుకంటారా?.

ఇప్పటి వరకు ఫైన్ కట్టించుకుంటున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇక మీదట జైలుకు పంపేందుకు రెడీ అవుతున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం డ్రంక్ అండ్ డ్రైవ్‌ను మరింత కఠినతరం చేస్తున్నారు. మోతాదుకు మించి ఎక్కువగా మద్యం సేవించి బ్రీత్ ఎనరైజర్‌లో దొరికితే నేరుగా జైలుకు పంపే నిబంధనలు తీసుకువచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చరిత్రలోనే మొదటి సారిగా జులై నెలలో 1084 మందిపై పోలీసులు కోర్టులో చార్జ్‌షీట్ వేశారు. వీరిలో సగం మందికి పైగా జైలు శిక్ష పడింది. సామాజిక సేవ చేయాలని కొందరిని న్యాయస్థానం ఆదేశించింది. ఒక్క జులై నెలలోనే డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారి నుంచి ఏకంగా రూ.38లక్షల70వేలను పోలీసుల వసూలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hyderabad traffic police  drunk and drive  fine  court  jail  

Other Articles