అన్ని పోకేమాన్ లను పట్టేసుకున్నాడు | Nick Johnson First Pokemon Go Player to Catch Every Pokemon

Nick johnson first pokemon go player to catch every pokemon

Nick Johnson Pokemon Go Player, Brooklyn man all pokemon, pokemon go all pokemons, pokemon go all pokemons catch, how to catch pokemons

Brooklyn man Nick Johnson First Pokemon Go Player to Catch Every Pokemon.

పోకేమాన్ అంతు చూసిన మొనగాడు

Posted: 07/26/2016 09:27 PM IST
Nick johnson first pokemon go player to catch every pokemon

మొబైల్ ఫోన్లలో గేమ్ లు ఆడేవారిని వైరస్ లా పట్టి పీడిస్తున్న 'పోకేమాన్ గో' అంతు చూశాడో అమెరికన్. బ్రూక్లిన్ కు చెందిన నిక్ జాన్సన్ అనే వ్యక్తి ఆటలో తుది వరకూ వెళ్లిపోయి మొత్తం పోకేమాన్ లను పట్టేసుకున్నాడు. అమెరికాలో అందుబాటులో ఉన్న 142 పోకేమాన్ లనూ పట్టేసుకున్నానని చెబుతూ సామాజిక మాధ్యమం రెడ్డిట్ లో ఓ పోస్టు పెట్టాడు. యాప్ లోని 'పోకేడెక్స్' సెక్షన్లో తాను పట్టుకున్న 142 పోకేమాన్ లనూ చూపించాడు.

రోజుకు 8 గంటలు, రెండు వారాలపాటు శ్రమించి మన్ హట్టన్, బ్రూక్లిన్ ప్రాంతాల్లో వెతికి పట్టుకున్నట్టు నిక్ జాన్సన్ ఓ ప్రముఖ పత్రికకు వెల్లడించాడు. వాస్తవానికి ఈ గేమ్ లో మరో 11 పోకేమాన్ లు ఉన్నాయంట. మిస్టర్ మైమ్, కంగష్ ఖాన్, ఫార్ ఫెచ్డ్ అనే పేరున్న పోకేమాన్ ఇతర దేశాల్లో పట్టి బంధించాలి. మిగిలిన ఆరు పోకేమాన్ లూ ఎక్కడ ఉంటాయో ఇంకా గేమ్ ను తయారు చేసిన నింటెండోనే ప్రకటించలేదు.

తన తొలి పోకేమాన్ 'స్క్వయిర్టిల్' అని, చివరిగా తాను 'ఒమాస్టార్'ను పట్టుకున్నానని చెప్పాడు. ఓ పోకేమాన్ కోసం న్యూయార్క్ కూడా ప్రయాణించానని తెలిపాడు. ఇప్పుడిక ఇతర దేశాల్లో ఉన్న పోకేమాన్ ల కోసం ట్రావెల్ సైట్లను స్పాన్సర్ చేయాలని సంప్రదిస్తున్నట్టు వెల్లడించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pokemon Go  Nick Johnson  all pokemon  

Other Articles