58 ఏళ్ల వైవాహిక జీవితం... మరణంలోనూ తోడు-నీడ | Couple from Texas die holding hands after 58 years together

Couple from texas die holding hands after 58 years together

Couple from Texas die holding hands, 58 years together dies with hand together, San Antonio couple

Couple from Texas die holding hands after 58 years together. San Antonio couple dies holding hands after 58 years of marriage.

అచ్చం సినిమాలా ఆ దంపతుల కథ...

Posted: 07/23/2016 04:13 PM IST
Couple from texas die holding hands after 58 years together

వైవాహిక జీవితంలోని మాధుర్యాన్ని ఒకటి కాదు రెండు 58 ఏళ్లు అనుభవించారు ఆ దంపతులు. కలిసి ఉన్నంత కాలం అన్యోన్యంగా ఒకరంటే ఒకరు ప్రాణంగా బతికారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేదు. వారి ప్రేమ ముందు మరణం కూడా ఓడిపోయింది. మనసును తట్టే ఈ ఉదంతం టెక్సాస్‌లోని సాన్ అంటోనియోలో జరిగింది.

దంప‌తుల పేర్లు సాన్ జార్జ్, ఒరా లీ రోడ్రిగ్యుజ్. చిన్న‌త‌నంలోనే ఓ మాంసం మార్కెట్‌లో వీరిరువురికీ ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఒకే స్కూల్లో వీరిరువురు కలిసి చదువుకున్నారు. ఆ త‌రువాత‌ మిలిటరీలో పనిచేసిన జార్జ్ ఒరా లీని వివాహ‌మాడారు. వీరికి ముగ్గురు పిల్లలు జ‌న్మించారు. 58 ఏళ్ల వైవాహిక జీవితంలో తోడూ నీడగా బతికారు. చివ‌రికి వయస్సు మీద పడటంతో అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ, ఎప్పటిలానే ఆ దంప‌తులు ప‌క్క‌ప‌క్క‌నే చేతిలో చేయి వేసి ప‌డుకున్నారు. నిద్ర‌లోనే జార్జ్ గుండెపోటు వ‌చ్చి ప్రాణాలు విడిచారు. ఆ త‌ర్వాత మూడు గంట‌ల‌కు ఒరా కూడా మరణించింది.

 గ‌త‌వారం 58వ పెళ్లిరోజు వేడుక‌ల‌ను జ‌రుపుకున్న‌ తమ తల్లిదండ్రుల గురించి కూతురు కొరినా మార్టినెజ్ మీడియాకు చెప్పింది. తమ తల్లిదండ్రులు ఒక్క రోజు కూడా ఒకరినొకరు విడిచి ఉండలేదు. చివరికి ఏదైనా పని మీద వెళ్లాల్సివస్తే ఎంతటి లాభసాటి పని అయినా సరే దానిని వదిలేసుకునే వాడంట. ఇక తల్లి ఒరాకి కూడా తండ్రి జార్జ్ అంటే ప్రాణం అని చెబుతోంది. తాగుబోతు అయిన తండ్రి విషయంలో తాము ఎన్నోసార్లు ఆయనతో గొడవపెట్టుకుంటే తల్లి మాత్రం ఆయన్ను వెనకేసుకొచ్చి, ఇంట్లోంచి బయటికి వెళ్లిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపింది. ఏదన్నా అంటే ప్రేమ అంటూ పెద్దగా కూతుళ్లకు క్లాసులు కూడా పీకేదంట. ఇక సోషల్ ఈ వృద్ధ ప్రేమ గురించి చదివిన వారు ‘నోట్‌బుక్‌’ అనే హాలీవుడ్ మూవీలో హీరోహీరోయిన్లు చనిపోయే సీన్ తో కంపేర్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Texas couple  San Antonio  58 years  die  hands together  

Other Articles