Test Day 2: India 512/6 at Tea against West Indies after Kohli’s double ton, Ashwin ton

India vs west indies kohli s double ton ashwin ton gives india big score

india vs west indies, west indies vs india, ind vs wi, wi vs ind, india tour of west indies, india cricket, west indies cricket, virat kohli, Jason Holder, Test series, anil kumble india, kumble cricket, kumble bowling, cricket, sports news, sports

Virat Kohli fell shortly after scoring his first ever double hundred as the Indian Test skipper was dismissed by Gabriel first ball after Lunch.

కోహ్లీ డబుల్ సెంచరీ, అశ్విన్ సెంచరీ.. భారీ స్కోరు దిశగా టీమిండియా

Posted: 07/22/2016 07:53 PM IST
India vs west indies kohli s double ton ashwin ton gives india big score

వెస్టిండీస్ పర్యటనలో నాలుగు టెస్టు సీరీస్ లలో భాగంగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా అదరగోడుతుంది. టాప్ అర్డర్ బ్యాట్స్ మెన్లలో ఓపెనర్ శిఖర్ ధావన్ రాణించగా, విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ అడి ఏకంగా తన కెరీర్ లో తొలి డబుల్ సెంచరీ సాధించగా, రవించంద్రన్ అశ్విన్ సెంచరీతో సత్తా చాటాడు. తొలి రోజున సెంచరీతో అదరగోట్టిన భారతస్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ.. రెండవ రోజు డబుల్ సెంచరీతో చెలరేగాడు. టెస్టుల్లో కోహ్లీకి అందని ద్రాక్షగా ఉన్న డబుల్ సెంచరీని కోహ్లీ పూర్తీ చేశాడు. కోహ్లీకి ఇది అద్బుతమైన ఇన్నింగ్స్గ్‌గా మిగిలిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. 281 బంతులను ఎదుర్కున్న కోహ్లీ 200ని పూర్తీ చేశాడు. 24 బౌండరీలు, 71.02 స్ట్రైక్‌రేట్‌తో కదం తొక్కడం విశేషం.

కాగా తీరా 200 పరుగులు సాధించగానే గాబ్రియల్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయిన కోహ్లీ పెవిలియన్ కు వెనుదిరిగాడు. ఇక టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా శతకంతో సత్తా చాటాడు. వెస్టీండీస్ పై అశ్వీన్ కిది మూడో సెంచరీ కావడం విశేషం. సరిగ్గా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ కూడా వెస్టిండీస్ పై మూడు శతకాలను నమోదు చేశాడు. కడపటి వార్తలు అందే సరికి అశ్విన్ 244 బంతులు ఎదుర్కొని 112 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. అశ్విన్ తోడుగా అమిత్ మిశ్రా కూడా 29 పరుగలతో రాణిస్తున్నాడు. అప్పటికి భారత స్కోరు ఆరు వికెట్ల నష్టానికి 525 పరుగలు సాధించింది.  

ఇటీవల కాలంలో కోహ్లీ భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడనడానికి ఈ డబుల్ సెంచరీయే ప్రత్యేక్ష ఉదాహరణ. వెస్టీండీస్ బౌలర్లను కోహ్లీ చాలా సులభంగా ఎదుర్కోంటున్నాడు. సదాసీదాగా స్ట్రైక్‌రోరేట్ చేస్తూ సౌకర్యవంతంగా క్రీజ్‌లో కదులుతున్నాడు. విదేశీగడ్డపై భారత క్రికెటర్లు పిల్లులు అనే వాదనను కోహ్లీ సమర్థవంతంగా తిప్పికొడుతున్నాడు. సమకాలిక క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డబుల్ సెంచరీ ద్వారా తానెంటో మరోసారి నిరూపించుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  West Indies tour  India vs West Indies 2016  Team india  BCCI  cricket  

Other Articles