rumour circulated on the social media about Rs 10 coin

Massive confusion about rs 10 coin

ten rupee, coin, rumours, RBI, Rs 10 coin accepted, Rs 10 coin rejected, Rs 10 coin, indian market rs 10 coin, Rs 10 coin social media, Rs 10 coin whatsapp, Rs 10 coin invalid

rumour circulated by some people on social media that the Reserve Bank of India (RBI) has declared the Rs 10 coin invalid.

ఈ నాణేల పరిస్థితేంటి..? క్లారిటీ వచ్చేదెన్నడు..?

Posted: 07/22/2016 06:59 PM IST
Massive confusion about rs 10 coin

భారతీయ రిజర్వు బ్యాంకు విడుదల చేసిన నాణేల పరిస్థితులపై సర్వత్రా సందేహాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పావలా, అర్థ రూపాయి సహా పలు నాణేలను దుకాణాదారులు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో అటు ఐదు రూపాయల కరెన్సీ నోటుపై కూడా అనుమానాలు రేకెత్తున్నాయి. ఇప్పటికే ఈ కరెన్సీ నోట్లను తీసుకుని సరుకులు ఇచ్చేందుకు దేశవ్యాప్తంగా పలువురు దుకాణాదారులు అంగీకరించడం లేదు. ఇక తాజాగా అదే తరహా సందేహాలు పది రూపాయల నాణెంపై కూడా నెలకోంది.

కొద్దిరోజులుగా పలు నగరాల్లో రూ.10 నాణెం తీసుకోవడానికి దుకాణదారులు ఇష్టపడటం లేదు. కొందరు తెలివిగా వాటిని వినియోగదారులకు అంటగడుతుంటే, ఆ తర్వాత సదరు వినియోగదారుడు మరో దుకాణానికి వెళ్లినప్పుడు వారు తీసుకోవడానికి నిరాకరిస్తున్నాయి. దీంతో రూ.10 నాణెం చెల్లుబాటుపై ప్రజలు తికమకపడుతున్నారు. నాణెం చెల్లదంటూ ఆర్‌బీఐ చెప్పినట్టు వాట్సాప్‌లో ఎవరో పోస్ట్ చేయడం ఈ ప్రచారానికి కారణమైంది. నాణేల కలెక్షన్ అంటే ఇష్టపడేవారు సహజంగానే రూ.10 నాణేలు విడుదల కాగానే వాటిని పదలిపరుచుకోవడంతో వాటి సర్క్యూలేషన్‌ మార్కెట్లో పెద్దగా లేదని చెప్పాలి.

అయితే నాణెం చెల్లదంటూ జరిగిన ప్రచారంతో ఇప్పుడు అవన్నీ మార్కెట్లో చెలామణికి వస్తున్నాయని కొందరు అంటున్నారు. మరి కొందరైతే వాటిని మార్చుకునేందుకు బ్యాంకుల వద్ద క్యూలు కడుతున్నారు. కాగా, దీనిపై లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ ఫర్ బ్యాంక్స్‌ పంకజ్ సక్సేనా వివరణ ఇచ్చారు. రూ.10 నాణెం రద్దు చేస్తున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించలేదని స్పష్టం చేశారు. నాణేలు చెల్లవంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని సూచించారు. అలాగే వాటిని తీసుకోవడానికి తిరస్కరించిన వ్యాపారులు చట్టరీత్యా శిక్షార్హులని అన్నారు. త్వరలోనే నాణేల చెల్లుబాటుపై ఆర్బీఐ స్పష్టత ఇవ్వనుందని సక్సేనా తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ten rupee  coin  rumours  RBI  indian market  rs 10 coin  social media  whatsapp  

Other Articles