Sachin Tendulkar reportedly sought Manohar Parrikar's help to rescue 'illegal' Mussoorie resort

Sachin tendulkar denies commercial interest in disputed property

controversy, Cricket, Dahlia Bank, Defence minister, DRDO, India, Landour, Manohar Parrikar, Mussoorie, Sachin Tendulkar, Sachin Tendulkar controversy, Sanjay Narang, tendulkar, sachin tendulkar land, tendulkar land, tendulkar land controversy, sanjay narang, tendulkar sanjay narang, landour cantonment, mussoorie, dehradun, tendulkar news

Indian cricket legend Sachin Tendulkar had met Defence Minister Manohar Parrikar last year to rescue a luxury holiday resort in Landour, Mussoorie embroiled in a security dispute with DRDO.

స్నేహితుడి కోసమే.. నాకెలాంటి లాభాపేక్ష లేదు: సచిన్

Posted: 07/20/2016 09:42 AM IST
Sachin tendulkar denies commercial interest in disputed property

తనపై గత కొద్ది కాలంగా జాతీయ మీడియాలో వస్తున్న వార్త కథనాలు నేపథ్యంలో ఎట్టకేలకు టీమిండియా బ్యాటింగ్ లెజెండ్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండుల్కర్ స్పందించాడు. కేంద్రరక్షణ మంత్రి మనోహర్ పారికర్ తో తన భేటీ విషయం మీడియాలో హైలెట్ అయిన నేపధ్యంలో మాస్టర్ వివరణనిచ్చారు. ముస్సోరిలో నిర్మితమవుతున్న ఓ రిసార్ట్ విషయమై తాను మంత్రితో చర్చించేందుకే వచ్చానని చెప్పారు. కేంద్ర రక్షణ శాఖతో తన స్నేహితునికి తలెత్తిన ఇబ్బంది దృష్ట్యా తాను పారికర్ తో భేటీ అయ్యానని చెప్పారు.

తన స్నేహితుడు నిర్మిస్తున్న రిసార్ట్ విషయంలో.. రక్షణ శాఖతో నెలకోన్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకువచ్చానని సచిన్ చెప్పుకోచ్చారు. అయితే తన స్నేహితుడి వ్యాపారాలలో తనకు ఎటువంటి వ్యాపార భాగస్వామ్యం లేదని, లాభాపేక్ష కూడా లేదని టెండూల్కర్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ముస్సోరిలోగల లండోరి కంటోన్మెంట్ ప్రాంతానికి సమీపంలో సంజయ్ నారంగ్ ఓ రిసార్ట్ ను నిర్మిస్తున్నారు.

భారత రక్షణ శాఖకు సంబంధించిన నిబంధనలకు విరుద్దంగా ఈ రిసార్ట్ నిర్మితం అవుతుందని భావించిన ఆర్మీ అధికారులు దానిపై చర్యలకు ఉపక్రమించారు. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ అధికారుల వేధింపులకు గురవుతున్న తన స్నేహితుడికి ఊరట కలిగించేందుకు, సమస్యను పరిష్కరించేందుకు తాను పూనుకున్నానని చెప్పారు. అయితే తన స్నేహితుడు సంజయ్ నారంగ్ నిర్వహిస్తున్న దహిలా బ్యాంకు లో తనకు వాటావుందని వస్తున్న అరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని సచిన్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sachin Tendulkar  Manohar Parrikar  Sanjay Narang  Mussoorie  DRDO  Landour  India  

Other Articles