Case Registered Against Priyanka Chopra's Brother By Pune Police

Famous bollywood actress s brother booked in drugs case

Priyanka Chopra's brother booked in drugs case, priyanka chopra brother, siddharth chopra, quantico, hukkah, tobacco, pub, lounge, mug shot, IPL, bollywood, siddharth chopra, priyanka chopra, priyanka, siddharth, the mugshot lounge, featured, entertainment, celebrities, movies, music, tv

Pune police registered a case against Siddharth for unauthorised use of hookahs in a ‘no-smoking zone’ near his The Mugshot Lounge in Koregaon Park area.

అడ్డంగా దొరికిన ప్రముఖ నటి సోదరుడు.. కేసు నమోదు..

Posted: 07/16/2016 09:31 AM IST
Famous bollywood actress s brother booked in drugs case

సినిమా ఇండస్ట్రీతో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు వున్నవారు ఈ మధ్యకాలంలో తరుచుగా వార్తల్లో నిలుస్తున్నారు. అందుకు కారణం వారు చేసే చట్టవ్యతిరేక కార్యకలాపాలే కావచ్చు. ఇందుకు ఏ రాష్ట్ర చిత్రసీమ చూసినా మినహాయింపు కాదని అర్థమవుతుంది. ఇక్కడ టాలీవుడ్ నుంచి అక్కడ బాలీవుడ్ ఇదో ఆనవాయితిగా మారిపోయింది. దీంతో సామాన్యుల నుంచి ఫాలోయింగ్ లభించే సెలబ్రిటీలు కూడా అడ్డంగా పోలీసులకు దోరికిపోయి బుకవుతున్నారు. ఇప్పడు ఈ కష్టాలను ఎదుర్కోంటుంది ఓ ప్రముఖ హీరోయిన్ తమ్ముడు. ఎవరాయన, ఎవరా నటి..?

హాలీవుడ్ నుంచి బాలీవుడ్‌‌ వరకు తన నటనాభినయంతో బిజీబిజీగా మారిన బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు తమ్ముడి రూపంలో ఇబ్బందులు వచ్చిపడుతున్నాయి. ప్రియాంక సోదరుడు సిద్ధార్థ్ చోప్రా ఇటీవల హోటల్ మేనేజ్‌మెంట్‌‌ పూర్తి చేశాడు. పుణేలేని కారేగావ్ పార్క్ సమీపంలో ‘ద మగ్ షాట్ లాంజ్’ హోటల్ నిర్వహిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం ఈ హెటల్‌‌లో ఐపీఎల్ బెట్టింగ్ జరుగుతోందంటూ పోలీసులు దాడులు చేసి భారీగా నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇది జరిగి మూడు నెలలు పూర్తి కాక మునుపే మరోసారి సిద్ధార్థ్ వార్తల్లో నిలిచాడు.
 
హోటల్ ఉండే ప్రదేశం మొత్తం నో స్మోకింగ్ ఏరియా..అయితే సిద్ధార్థ్ హోటల్‌‌లో హుక్కా మరియు పొగాగు ఎక్కువగా వాడుతున్నారన్న సమాచారంతో పోలీసులు సోదాలు చేయగా, అంతా నిజమేనని పోలీసులు నిగ్గు తేల్చారు. దీంతో సిద్ధార్థ్ చోప్రా, మేనేజర్ ప్రకాష్ చౌదరిపై కేసు నమోదు చేశారు. వీరితో పాటు మరో పదిమందిని అరెస్ట్ చేశారు. సుమారు రూ.20వేలు విలువ చేసే హుక్కా ప్యాకెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇలా సిద్ధార్థ్ వార్తల్లో నిలవడం ఇదేం మొదటి సారి కాదు. ఇలా పదే పదే వార్తల్లో నిలవడంతో వారి కుటుంబీకులు తలదించుకోవాల్సి వస్తోందని ప్రముఖులు వాపోతున్నారు. ఇదివరకే ఒకసారి కేసు నమోదయ్యింది అప్రమత్తం కావాల్సిన వ్యక్తి ఇలా ఎందుకు చేస్తున్నారంటూ ప్రియాంక చోప్రా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : priyanka chopra  siddharth chopra  quantico  hukkah  tobacco  mug shot lounge  bollywood  

Other Articles