ఈ ఒక్క ఫోటోతో వెయ్యి రెట్ల ఉద్యమం | Black Lives Matter protest photo hailed as legendary

Black lives matter protest photo hailed as legendary

Black Lives Matter, America black racists arrest, protest photo hailed as legendary

Black Lives Matter protest photo hailed as legendary.

ఈ ఒక్క ఫోటోతో వెయ్యి రెట్ల ఉద్యమం

Posted: 07/12/2016 04:35 PM IST
Black lives matter protest photo hailed as legendary

ఇద్దరు నల్లజాతీయుల అకారణ హత్యలతో రగిలిన రావణ కాష్టం అమెరికాను ఇంకా దహించి వేస్తోంది. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు నిరసనలతో, ఆందోళనలతో నానాటికి చేయి దాటిపోతున్నాయి. రోడెక్కిన నల్లజాతీయులంతా కాల్చి చంపడానికి తామేం పిట్టలం కాదని, తమను బతకనీయండంటూ ఫ్లకార్డులు ప్రదర్శించి ఉద్యమిస్తున్నారు. అయితే సహచర పోలీసులను మట్టుపెట్టడంపై తీవ్ర ఆగ్రహాంతో ఉన్న పోలీసు దళాలు ఎక్కడికక్కడే అణచివేతకు దిగుతున్నారు.

ప్రస్తుతం 'బ్లాక్‌ లివ్స్‌ మేటర్‌' పేరుతో ఓ హాష్ ట్యాగ్ సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది. ఓ నల్లజాతి యువతిని ఇద్దరు పోలీసులు బలవంతంగా లాక్కెళుతున్న దృశ్యం అమెరికాలోని నల్ల జాతీయుల పట్ల వివక్ష తీవ్రతకు అద్దం పడుతున్నది. బాటన్‌రోగ్‌లో జరిగిన ఆందోళనలో ఈ ఫోటోలో ఉన్న యువతి పాల్గొన్నట్టు తెలుస్తోంది. బాటన్ రోగ్ లో ఆదివారం జరిగిన ఆందోళనలో 100 మంది నల్ల జాతీయులను అమెరికా పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న నల్లజాతి యువతిని ఇద్దరు పోలీసులు బలవంతంగా లాక్కెళ్లడం ఈ ఫోటోలో స్పష్టంగా కనిపిస్తున్నది. విశ్లేషకులు మాత్రం దీనిని చూసి ఒక్క ఫోటో వెయ్యి రెట్ల ఉద్యమ స్ఫూర్తిని రగిలించిందంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

black lives matter

ఇక ఈ దృశ్యాన్ని జొనాథన్‌ బచ్‌మ్యాన్‌ అనే ఫోటోగ్రాఫర్‌ తీశారు. అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్‌కు గత కొన్ని రోజులుగా పని చేస్తున్నారు. ఇటీవల ఆ సందర్భంగా నల్ల జాతీ యులపై జరు గుతున్న దాడులకు నిరసనను ఆయనే కవర్ చేస్తున్నారు. నిజానికి 'బ్లాక్‌ లివ్స్‌ మేటర్‌' పేరుతో సోషల్‌ మీడియా ప్రచారం 2013లోనే మొదలైంది.

ట్రేవన్‌ మార్టిన్‌ అనే 17 ఏండ్ల యువకుడిని (స్టాన్‌ ఫొర్డ్‌లో) కాల్చి చంపిన జార్జి జిమ్మర్‌ మ్యాన్‌ అనే తెల్లజాతి పోలీస్‌ను నిర్దోషిగా విడుదల చేసిన అనంతరం ఈ ప్రచార ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. నాలుగేళ్ల తర్వాత లూసియానా,మిన్నెసోటాలలో జరిగిన వేర్వే రు సంఘటనల్లో ఇద్దరు నల్ల జాతీయులను తెల్ల పోలీసులు కాల్చి చంపిన తర్వాత జాతి వివక్షకు వ్యతిరేకంగా మరోసారి ఆందోళనలు పెల్లుబికాయి. డల్లాస్‌లో గురువారం రాత్రి జరిగిన ఆందో ళన సందర్భంగా ఓ నల్లజాతీయుడు కాల్పులకు తెగించగా ఐదుగురు పోలీసులు మృతి చెందిన విషయం విదితమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : America  Black Lives Matter  woman arrest  

Other Articles