Awful video shows man pulling out his friend's teeth with rusty pliers

Diy dentist in egypt pulls out a man s teeth using pliers

Youtube, Awful video, rusty pliers, dental teeth, Egypt, dentist, puling out teeth, pulling out the teeth with pliers, viral video

viral on social media, a man in a makeshift ‘clinic’ by a roadside in Egypt is seen yanking out the tooth of a ‘patient’, complete with the root, using nothing but a pair of rusted pliers.

ITEMVIDEOS: ఈ దంత వైద్యుడు.. ఎంతో స్సెషల్..!

Posted: 07/10/2016 07:48 AM IST
Diy dentist in egypt pulls out a man s teeth using pliers

దంత సమస్య వుంటే రకరకాల నాటు వైద్యాలు చేసేవాళ్లను మనం మన దేశంలో అనేకమందిని చూస్తాం. కొందరు విషపూరితమైన చెట్ల కాయలను నెయ్యితో కలసి వైద్యం చేస్తే మరికోందరు చెవిలో ఓ చెట్టు పసరు పోసి మరీ వైద్యం చేస్తారు. ఇందంతా ఒక ఎత్తు.. కానీ దంతాల సమస్య ఉందంటూ తన వద్దకు వచ్చిన పేషెంట్ కు ఓ డెంటిస్ట్ వింత వైద్యం చేశాడు. అదేంటి ఎలాంటి వైద్యం అంటారా..? ఇందులో వింతకన్నా.. అతడు దంతాన్ని పీకేయడానికి వాడిన పరికరం మాత్రం అత్యంత వింతగా వుంది.

మామూలుగా అయితే.. దంత వైద్యుడు తన వద్దకు వచ్చిన పేషంటుకు స్టెరిలైజ్ చేసిన పరికరాలతో వైద్యం చేస్తాడు. కానీ ఈ వైద్యుడు దంతాన్ని పీకేందుకు వాడిన పరికరమే అత్యంత చర్చనీయాంశంగా మారింది. అదెలా అంటారా..? ఓ తుప్పుపట్టిన కటింగ్ ప్లయర్నే ఆపరేషన్ సాధనంగా మార్చుకున్నాడు. కటింగ్ ప్లయర్ నోటిలో పెట్టి బలంగా లాగి దంతాన్ని పీకేశాడు. అయితే ఈ సీన్ మొత్తం ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో యూట్యూబ్లో వైరల్ గా మారింది.డాక్టర్కు క్లినిక్ అంటూ ఏదీ లేదు. రోడ్డుపక్కన వైద్యం చేస్తుంటాడు.

ఓ వ్యక్తి తన సమస్యను ఆ డాక్టర్కు విన్నవించుకున్నాడు. కూర్చీలో పేషెంట్ ను కూర్చోబెట్టి తుప్పుపట్టిన కటింగ్ ప్లయర్తో ఆపరేషన్ చేశాడు. అదేనండీ.. నాలుగైదుసార్లు ప్రయత్నించి చివరికి దంతాన్ని పీకేశాడు. కానీ ఆ పేషెంట్ నొప్పితో విలవిలలాడిపోయాడు.ఎందుకంటే దంతంతో పాటు చిగురు కొంత భాగం కూడా ఊడివచ్చినట్లు వీడియోలో కనిపిస్తోంది. పేషెంట్ నొప్పితో బాధపడుతుంటే.. మరోవైపు ఆ వైద్యుడు మాత్రం ఏదో సాధించాను అన్న తరహాలో నవ్వుతుండటం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Youtube  Awful video  rusty pliers  dental teeth  viral video  

Other Articles