77 ఏళ్ల ముసలోడు... ఇండియన్ చార్లెస్ శోభరాజ్! | story on Indian Charles Sobhraj Dhani Ram Mittal

Meet indian charles sobhraj dhani ram mittal

Indian Charles Sobhraj, Dhani Ram Mittal, Indian Super Thief, Old theif of India, Super Car thief, Super Natwarwal

Meet 77 years old Indian Charles Sobhraj Dhani Ram Mittal.

ITEMVIDEOS:77 ఏళ్ల ముసలోడు... ఇండియన్ చార్లెస్ శోభరాజ్!

Posted: 07/08/2016 09:36 AM IST
Meet indian charles sobhraj dhani ram mittal

మీముందున్నది భారత చార్లెస్ శోభరాజ్. వయస్సు 77 ఏళ్లు. పోలీసులు ముద్దుగా సూపర్ నట్వర్ లాల్ అని పిలుచుకుంటారు. పాడెక్కే వయసులో ఇతగాడు అంతలా నేరాలు ఏం చేశారంటారా? తెలిస్తే షాకయ్యి మీ నోళ్లు అమాంతం తెరుస్తారు. 60 ఏళ్ళ క్రైం హిస్టరీలో లెక్కలేనన్ని నేరాలు చేస్తూ ఎప్పటికప్పుడు తప్పించుకుంటున్నాడు. అయినప్పటికీ పోలీసు లెక్కల్లో ఉన్నది మాత్రం కేవలం 128 కేసులే. అతని అసలు పేరు ధనీ రామ్ మిట్టల్.

ఈ సూపర్ థీఫ్. 1961 నుంచి కెరీర్ ప్రారంభిస్తే... 1964లో మొట్టమొదటిసారి పోలీసులతో బేడీలు వేయించుకున్నాడు. ఈ మంగళవార మరోసారి దొరికి 25వ సారి కటకటాల పాలయ్యాడు. చివరగా మే నెలలోనే కారు దొంగతనం కేసులో అరెస్టయిన ధనిరామ్ బెయిలుపై విడుదలైన కొద్ది రోజుల్లోనే మళ్లీ అరెస్టయ్యాడు.

అచ్చం సినిమా స్టైల్లో గెటప్ మార్చి మరీ దొంగతనాలు చేయటం ఈ వృద్ధ చోరుడి స్పెషాలిటీ. పోలీసు, జడ్జి, సీఐ, ప్రభుత్వ అధికారి.. ఇలా ఏ వేషం వదలకుండా చేతివాటం ప్రదర్శిస్తుంటాడు. లా గ్రాడ్యుయేట్ అయిన ధనిరామ్ 1960లో రోహ్‌తక్ కోర్టులో క్లర్క్‌గా చేరాడు. ఒకసారి జడ్జి సెలవుల్లో ఉండగా ఆ వేషంలో రెండు నెలలపాటు కొనసాగి పలువురు నేరగాళ్లకు ఎడాపెడా బెయిలు మంజూరు చేసి పారేశాడు. ఆ కేసులో అరెస్టయి రిలీజ్ అయ్యాడు.

 

ఆపై నకిలీ సర్టిఫికెట్లతో 1968లో రోహ్‌తక్ రైల్వే స్టేషన్ మాస్టర్ అయ్యాడు. ఏడాది తర్వాత నిజం బయటపడడంతో కటకటాలపాలయ్యాడు. అతనిపై ఇప్పటి దాకా 128 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఇక కుర్ర దొంగలకు కూడా సాధ్యం కాని రీతిలో ఎటువంటి కారునైనా నిమిషంలోనే అన్‌లాక్ చేసి తుర్రుమనడం ఈ దొంగగారి ప్రత్యేకత. ఇప్పటి వరకు 1000కిపైగా కార్లను దొంగిలించిన ఆయన ఎక్కువగా ఎస్టీమ్, మారుతి 800, హుందయ్ శాంత్రో తదితర కార్లను దొంగతనానికి ఎంచుకుంటాడు. వాటికి సెక్యూరిటీ లారం ఇందుకు కారణని చెబుతున్నాడు కూడా. దొంగిలించిన వాటిని కండీషన్ బట్టి పశ్చిమ ఢిల్లీలోని యూజ్‌డ్ కార్ డీలర్‌కు రూ.30 వేల నుంచి రూ.50 వేలకు అమ్మేస్తాడు.

ఇక అతడిని జైలు గదిలో అందరితో కలిపి ఉంచేందుకు అధికారులు సైతం భయపడుతుంటారు. ఇతర ఖైదీలను తన వాక్చాతుర్యంతో మెప్పిస్తాడు. వారికి చట్టంలోని లొసుగులు విడమరిచి చెబుతాడు. దీంతో వారి కేసును వారే వాదించుకుంటున్నారని జైలు అధికారులు చెబుతున్నారు.

కాగా ధనిరామ్ అవుటర్ ఢిల్లీలోని నరేలాలో భార్య, కోడలుతో కలిసి ఉంటున్నాడు. తండ్రి చేష్టలతో విసుగు చెందిన ఇద్దరు కుమారులు వేర్వేరుగా ఉంటున్నారు. కుక్క తోక వంకరలాగా, ఇన్ని సార్లు దొరికినప్పటికీ తన బుద్ధి మాత్రం మార్చుకోలేకపోతున్నాడీ 77 ఏళ్ల వృద్ధ చోర శిఖామణి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian Charles Sobhraj  Dhani Ram Mittal  Super Natwarwal  

Other Articles