youth harrassed woman by posting livein relationship photos, arrested

Youth arrested for posting photos on facebook

banglore software company, pharma company manager, live-in realtion-ship, Hyderabadi, karnataka, Facebook, Harassment, Mahesh, crime

A pharma company manager mahesh who harrassed a woman by posting live in relationship photos on facebook arrested

యువతి ఫేస్ ’బుక్‘ చేసిన యువకుడికి అరదండాలు

Posted: 07/05/2016 08:32 AM IST
Youth arrested for posting photos on facebook

సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్ బుక్ ను అనుసంధానంగా చేసుకుని చేయకూడని పనులు చేస్తున్న కేసులో తమిళనాడుకు చెందిన వినుప్రియ ఆత్మహత్య ఉదంతం. ఆ వెనువెంటనే నిందితుడి అరెస్టు విషయం యావత్ దేశంలో సంచలనంగా మారినా.. ఇంకా అలాంటి ధోరణినిన కోందరు యువకులు వీడటం లేదు. సహజీవనం చేసిన యువతి తర్వాత తనను పట్టించుకోవడంలేదని ఓ ఫార్మా కంపెనీ మేనేజర్ ఆమెపై కక్షగట్టాడు. గతంలో ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలు ఫేస్‌బుక్‌లో పెట్టి వేధిస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదుతో ప్రస్తుతం నిందితుడు కటకటాలపాలయ్యాడు.

పోలీసుల కథనం ప్రకారం...హైదరాబాద్‌కు చెందిన యువతి, బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో కొన్ని రోజులు కలిసి పని చేసింది. ఆ సమయంలో అమెకు అక్కడ కర్ణాటకకు చెందిన మహేశ్ తో పరిచయం ఏర్పడింది. అది క్రమంగా స్నేహంగా మారింది. దీంతో అసలే వచ్చే అరకోర డబ్బులు.. కేవలం అద్దె గదులకే వేతనాల్లోని అధిక భాగం ఖర్చుఅవుతుండగా,  అతనితో కలసి ఓకే గదిని తీసుకుని నివాసముంది. దీంతో కొంతకాలం వారిరుపురూ సహజీవనం చేశారు.

ఇటీవల యువతికి హైదరాబాద్‌కు బదిలీ కావడంతో వారి మధ్య గ్యాప్ ఏర్పడిం ది. తనతో కలిసి ఉండాలని, లేకపోతే సహజీవనంలో ఉన్నప్పుడు కలిసి దిగిన ఫొటోలను బయటపెడతానని మహేశ్ బెదిరించడం మొదలుపెట్టాడు. ఆమె పట్టించుకోకపోవడంతో ఆ ఫొటోలను అమ్మాయి ఫేస్‌బుక్ ఖాతాలో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ పంపించాడు. దీంతో బాధితురాలు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు మహేశ్‌ను అరెస్టు చేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : software company  Hyderabadi  karnataka  Facebook  Harassment  Mahesh  crime  

Other Articles