అమరావతికి ఎయిర్ అంబులెన్స్ లు వస్తున్నాయి | Civil Aviation Minister gives nod for air ambulances in Amaravathi

Civil aviation minister gives nod for air ambulances in amaravathi

Civil Aviation Minister, Air ambulance in AP capital, Air ambulance for amaravathi, ఏపీకి ఎయిర్ అంబులెన్స్, తాజా వార్తలు, ఏపీ వార్తలు

Civil Aviation Minister Ashok Gajapathi Raju gives nod for Air ambulances for AP capital Amaravathi. It would therefore be of great use for recipients of organs, he asserted, and requested necessary action at the earliest.

అమరావతికి ఎయిర్ అంబులెన్స్ లు వస్తున్నాయి

Posted: 06/30/2016 10:33 AM IST
Civil aviation minister gives nod for air ambulances in amaravathi

ఎయిర్ అంబులెన్స్ హైవేలలో యాక్సిడెంట్లు అయిన సందర్భంలో అత్యవసర సేవల కోసం విమానాలను వినియోగించటమే ప్రధాన ఉద్దేశ్యం. ప్రమాదాలలో గాయపడిన వారికి అత్యవసరంగా అవయవదానం అవసరం అవుతుంది. అదే సమయంలో వేరే చోట బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రావొచ్చు. ఇలాంటి ఎమర్జెన్సీ కేసుల్లో ఈ ఎయిర్ అంబులెన్స్ లు అవసరమవుతాయి.

అయితే ఎయిర్ అంబులెన్స్ లు అందుబాటు లేని సమయంలో అంబులెన్స్ ల ద్వారా ఆ పని చేసేందుకు ప్రభుత్వాలు మొగ్గు చూపుతుంటాయి. ఇందుకోసం సపరేట్ గా గ్రీన్ కారిడార్ ను ఏర్పాటు చేస్తుంటారు. కానీ, నవ్యాంధ్రకు ఇప్పుడు గ్రీన్ కారిడార్ల అవసరం ఇక లేదు. ఎందుకంటే త్వరలో అక్కడ ఎయిర్ అంబులెన్స్ లు దర్శనమివ్వనున్నాయి.

అమరావతి కేంద్రంగా ‘ఎయిర్ అంబులెన్స్’లకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బుధవారం స్పీకర్ కోడెల శివప్రసాద్ నేతృత్వంలో ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, మరికొంత మంది అధికారులతో కలిసి కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, సురేశ్ ప్రభు తదితరులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎయిర్ అంబులెన్స్ లపై కామినేని ప్రతిపాదనకు అశోక్ గజపతిరాజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే ఇవి అమలులోకి రానున్నాయి. అయితే ల్యాండింగ్ కు ఇబ్బంది లేకుండా ప్రధాన పట్టణాలలో రన్ వేలను నిర్మించుకోవాలని ఈ సందర్భంగా అశోకగజపతి రాజు కామినేనికి సూచించారంట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Civil Aviation Minister  Ashok Gajapathi Raju  Air ambulance  Amaravathi  kamineni  

Other Articles