సిల్లీ రీజన్ తో ఆగిపోయిన వివాహం... ఎక్కడా? | bride relatives cancelled marriage due to no videographer

Bride relatives cancelled marriage due to no videographer

no videographer marriage cancelled, Bride relatives cancelled marriage, marriage cancelled for silly reason, సిల్లీ రీజన్ తో ఆగిపోయిన పెళ్లి, వీడియోగ్రాపర్ లేడని పెళ్లి ఆపేశారు, సిల్లీ రీజన్ తో మ్యారేజ్ కి శుభం, పెళ్లికి శుభం కార్డు ఎందుకేశారు, వధువు బంధువులు పెళ్లి ఆపారు, వీడియోగ్రాఫర్ లేడని పెళ్లి, తమిళనాడు పెళ్లి, tamilnadu marriage stopped, national news

Bride relatives cancelled marriage due to no videographer in tiruchy. Marriage cancelled due to no videographer Relatives of a girl stopped her wedding a few minutes before the ceremony could be solemnised near Thuraiyur in Tiruchy district, as the bridegroom’s family did not arrange for video coverage, but only one photographer.

సిల్లీ రీజన్ తో ఆగిపోయిన పెళ్లి... ఎక్కడ?

Posted: 06/27/2016 09:59 AM IST
Bride relatives cancelled marriage due to no videographer

పెళ్లంటే... పందిళ్లు, తప్పెట్లు, తాళాలు, ఏడగులు, మూడు ముళ్లు ఇవే కానీ అంతకు మించి మరోకటి ఉందంటే ఎవరైనా నమ్ముతారా? కాసేపట్లో ఓ జంట ఒకటి కాబోతుంది. చుట్టాలతో మండపం అంతా కళకళలాడుతోంది. అంతలో ఆపండి... అనే డైలాగే. కానీ, ఈసారి వెరైటీగా అమ్మాయి తరపున వాళ్ల నుంచి అదొచ్చింది. మెడ వంచి తాళి కట్టించుకోవాల్సిన వధువును మెడపట్టి పెళ్లి పీటలపై నుంచి లేపి తీసుకెళ్లాడు

అమ్మాయివాళ్లు లాంఛనాలు అన్ని కరెక్ట్ గానే సమర్పించుకున్నాడు ఆమె తండ్రి. అబ్బాయి వాళ్లు మంచోళ్లు, పైగా చుట్టాలు కూడా. మరి పెళ్లేందుకు ఆపినట్లు?. కారణం తెలిస్తే ఔరా అనుకుంటారు. ఆ వేడుకలో వీడియో గ్రాఫర్ కనిపించకపోవడంతోనే వారు పందిరి విడిచి వెళ్లిపోయారంట. తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి జిల్లా తురైయూర్‌లో ఆదివారం ఈ ఘటన జరిగింది.

తరూచ్చికి చెందిన సెంథిల్(33)కు బంధువుల అమ్మాయి అయిన కోమాబాయ్‌‌తో ఆదివారం(జూన్ 26న) వివాహం జరిపించేందుకు పెద్దలు నిశ్చయించారు. పెళ్లి కోసం సెంథిల్ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. సమయం దగ్గర పడుతుండడంతో వధూవరులిద్దరూ మండపం చేరుకున్నారు. పురోహితుడు వేదమంత్రాలు ప్రారంభించాడు. అయితే ఈ వేడుకను ఒకే ఒక్క ఫొటోగ్రాఫర్ కవర్ చేస్తుండడంతో అనుమానం వచ్చిన వధువు తండ్రి, ఇద్దరు కొడుకులు వీడియో గ్రాఫర్ ఎక్కడంటూ వరుడి తండ్రిని ప్రశ్నించారు.

ఖర్చులకు వెనుకాడి వీడియోగ్రాఫర్‌ను పెట్టలేదని సెంథిల్ తండ్రి సమాధానం ఇచ్చాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన వారు అక్కడే గొడవకు దిగారు. అంతటితో ఆగక ఆమె తండ్రి తంగరసు, ఆమె ఇద్దరు సోదరులు వధువు కోమాబాయ్ ను తీసుకుని కల్యాణమండపం నుంచి వెళ్లిపోయారు. దీంతో అప్పటి వరకు కళకళలాడిన పెళ్లి మండపం ఒక్కసారిగా బోసిపోయింది. ఈ ఘటనపై తన తల్లిదండ్రులతో కలిసి వరుడు సెంథిల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bridegroom  no videographer  tamilnadu marriage  bride relatives  

Other Articles