SHOCKING! Woman, lover tied together naked in Rajasthan village for 2 days

Woman lover tied together naked in public for 2 days

Woman, lover, Rajasthan village, Rajasthan, Udaipur district, Kasotia village, Woman-lover naked parade, husband, social media, Photos, woman tortured, tribal, tribal woman, woman paraded naked, lover, crime

A married woman and her supposed lover were paraded naked and then tied together for two days and a night in a village in Rajasthan's Udaipur district

ITEMVIDEOS: దారుణం: ప్రేమికుల్ని గ్రామంలో నగ్నంగా ఊరేగించి..

Posted: 06/25/2016 11:01 AM IST
Woman lover tied together naked in public for 2 days

రాజస్థాన్లో ఇంకా అటవిక శిక్షలు కొనసాగుతున్నాయి. ఓ వైపు తాను పెళ్లిచేసుకున్న భార్యకు అంతకుముందే వేరే వ్యక్తితో ప్రేమాయణం వుందని తెలిసి తమ సతిని ప్రేమికులకు ఇచ్చి కట్టబెడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్న క్రమంలో.. అత్యంత దారుణమైన అటవిక శిక్షలు కొనసాగుతుండటం కలకలం రేపుతుంది. రాజస్థాన్ లో ఉదయ్పూర్ జిల్లాలో దుశ్శాసనపర్వం చోటుచేసుకుంది. ప్రేమికులను తమ గ్రామానికి తీసుకువచ్చి నట్టనడి గ్రామాన నగ్నంగా దారుణంగా అవమానించారు. ఇంతకీ అ ప్రేమికులు చేసిన నేరమేంటి..?

తనకు ఇస్టం లేని పెళ్లి చేసిన తల్లిదండ్రులను నిందించకుండా.. తానను పెళ్లి చేసుకున్న భర్తను వదిలి ప్రియుడితో పారిపోయిన మహిళకు గ్రామం నడిబొడ్డున అవమానం జరిగింది. భార్యను అమెతో పాటు అమె ప్రేమికుడిని తమ గ్రామానికి తీసుకోచ్చిన భర్త, ఆయన కుటుంబ సభ‍్యులు, గామస్తులు కలసి.. గిరిజన తెగకు చెందిన ఆ యువతిని, ప్రియుడిని పట్టుకుని వచ్చి నగ్నంగా ఊరేగించారు. ఆ తర్వాత ఇద్దరినీ అలాగే రెండు రోజుల పాటు కట్టేసి చిత్ర హింసలు పెట్టారు. వారి చిత్రహింసలకు బాధితులు అంగలార్చుతున్న వారిని కనుకరించలేదు.

సంఘటన గురించి తెలుసుకున్న యువతి ప్రియుడు లాలూరామ్ కుటుంబ సభ్యులు.. భర్త కుటుంబసభ్యులకు పరిహారంగా 80 వేల రూపాయలు చెల్లించడంతో రెండు రోజుల తర్వాత అతణ్ని విడిచి పెట్టారు. అయితే బాధితురాలిని మాత్రం అలానే నగ్నంగా కట్టిపడేశారు. కొందరు యువకులు ప్రేమికులు నగ్నంగా కట్టిపడేసిన ఫొటోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రభుత్వ కార్యాలయం, స్కూలుకు సమీపంలోనే ఈ సంఘటన జరిగింది. స్కూలు టీచర్లు, వైద్య సిబ్బంది ఈ దృశ్యాలను చూసినా ఎవరూ అధికారులకు ఫిర్యాదు చేయలేదు.

కొందరు గ్రామ యువకులు ప్రేమికులు నగ్నంగా కట్టిపడేసి వున్న ఫోటోలను తీసి.. సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో.. చివరాఖరకు విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధిత మహిళను రక్షించారు. మహిళ భర్త, ముగ్గురు మహిళలతో సహా 13 మందిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ గ్రామ పట్వారీని జిల్లా ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వివరణ ఇవ్వాల్సిందిగా టీచర్లు, వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఉదయ్పూర్ ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ గోయల్ గ్రామంలో పోలీసు క‍్యాంపు ఏర్పాటు చేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajasthan  Udaipur district  Woman-lover naked parade  husband  crime  

Other Articles