ప్రధానికి ట్రాఫిక్ చలానా పంపారు | Cambodian PM Hun Sen has been fined by a traffic police

Cambodian pm hun sen has been fined by a traffic police

PM fined, Cambodian Prime Minister Hun Sen, traffic police fined to PM, హెల్మెట్ లేదని పీఎంకు ఫైన్, కంబోడియా పీఎంకు ట్రాఫిక్ చలానా, తాజా వార్తలు, latest news, International news

Cambodian Prime Minister Hun Sen has been fined by a traffic police for not wearing a helmet during his motorbike ride last week in south-western Koh Kong province, China’s Xinhua news agency reported.

ప్రధానికి ట్రాఫిక్ చలానా పంపాడు

Posted: 06/23/2016 06:16 PM IST
Cambodian pm hun sen has been fined by a traffic police

రూల్ ఈజ్ రూల్. రూల్ ఫర్ ఆల్ అనే సూత్రాన్ని తూచా తప్పకుండా ఫాలో అయ్యాడు ఓ ట్రాఫిక్ ఎస్సై. హెల్మెట్ లేకుండా బండి నడిపినందుకు ఏకంగా ప్రదాన మంత్రికే ఫైన్ వేసి చలాన్ పంపాడు. ఆగండి మన ప్రధాని రోడెక్కి బండి నడిపే సీన్ ఎక్కడిదనుకుంటున్నారా? ఇది జరిగింది మన దేశంలో కాదులేండి.

కంబోడియా ప్రధాని హన్ సేన్ ఈ మధ్య కో కాంగ్ ప్రావిన్స్ లో పర్యటించారు. ఎప్పుడూ కార్లో, విమానాల్లో తిరిగి ఉన్న ఆయనకు అక్కడ ఓ బైక్ చూడగానే ముచ్చటేసింది. అంతే రయ్ మంటూ రోడ్ల మీదకు దూసుకెళ్లారు. అధికారులు, జనాలు ప్రధాని సరదా తీరిందని చూస్తూ ఉన్నప్పటికీ ఓ ట్రాఫిక్ పోలీస్ మాత్రం తన ధర్మం విస్మరించలేదు.

హెల్మెట్ లేని కారణంగా ఫైన్ వేస్తూ ఆయనకు చలానా పంపాడు. ఈ విషయాన్ని హన్ సేన్ తన ఫేస్ బుక్ ద్వారా తెలిపాడు. నిబంధనలు ఉల్లఘించినందుకు ప్రజలకు క్షమాపణలు చెబుతూ తనకు విధించిన జరిమానా కడతానని పేర్కొన్నాడు. డ్యూటీ సక్రమంగా నిర్వహించిన పోలీస్ అధికారిపై ప్రశంసలు కురుస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cambodian Prime Minister  Hun Sen  Traffic police  Traffic challan  

Other Articles