నింగికెగసిన మరో తెలంగాణ సాహితివేత్త | Telangana Guda Anjaiah is no more

Vetaran telangana poet guda anjaiah is no more

Vetaran Telangana poet Guda Anjaiah passes away, Guda Anjaiah died, Guda Anjaiah no more, kcr condolence to guda anjaiah, telanagana veteran poet died, KCR guda anjaiah, తెలంగాణ వార్తలు, గూడ అంజయ్య ఇక లేరు, తెలంగాణ సాహితివేత్త గూడ అంజయ్య మృతి, తెలంగాణ వార్తలు, తాజా వార్తలు, latest news, telugu news, telanagana news

Vetaran Telangana poet Guda Anjaiah is no more.Vetaran Telangana poet Guda Anjaiah passes away.

నింగికెగసిన మరో తెలంగాణ సాహితివేత్త

Posted: 06/21/2016 06:52 PM IST
Vetaran telangana poet guda anjaiah is no more

తెలంగాణ సాహితివేత్తగా, ప్రజా ఉద్యమ కారుడిగా, గాయకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించించుకున్న గూడ అంజయ్య(61) ఇక లేరు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజిల్ పరిధి రాగన్నగూడెంలోని త‌న స్వ‌గృహంలో ఆయ‌న తుది శ్వాస విడిచారు. కొంత కాలంగా ఆయన గుండె జబ్బు, పక్షవాతంతో బాధపడుతూ నిమ్స్ లో చికిత్స పొందుతోన్న సంగతి తెలిసిందే. గూడ అంజయ్య 1955లో ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం లింగాపురంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు లక్ష్మయ్య, లక్ష్మమ్మ.

"ఊరు మనదిరా" పాటలతో ఆయనకు పేరు రావటమే కాదు, అది ఏకంగా 16 భాషలలో అనువాదమయింది. తెలంగాణలో సర్కారీ దవాఖానాల దుస్థితిని ఎండగట్టింది "నేను రాను బిడ్డో మ‌న ఊరి ద‌వాఖానా"కు అనే పాట ఆయన కలం నుంచి జాలువారిందే. ఆయన రాసిన ఎన్నో పాటలు తెలంగాణ వాసుల గొంతుల్లో ప్రతీరోజూ ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. గూడ అంజయ్య తెలంగాణ సాంస్కృతిక సంఘ నాయకునిగా పనిచేశారు. నలభై ఏళ్లుగా తెలంగాణ సాహితీ ప్రపంచంలో సేవలందించిన అంజయ్య కలకాలం నిలిచిపోయే పాటలు ఎన్నో రాశారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఆయ‌న రాసిన పాట‌లు పోరాటానికే కొత్త ఊపిరులూదాయి. తెలంగాణ మొదటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ఉత్తమ కవి అవార్డును ఆయన అందుకున్నారు.

కాగా, ఆయన మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. అంజయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ ఉద్యమంతో పాటు అనేక సామాజిక అంశాలపై అంజయ్య గేయాలు రాశారని, తెలంగాణ సమాజానికి ఆయన చేసిన సేవలు ఎన్నటికీ మరవలేమని కేసీఆర్ పేర్కొన్నారు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vetaran Telangana poet  Guda Anjaiah  CM KCR  telugu news  

Other Articles