కాపులను బిసిలలోకి చేర్చాలని డిమాండ్ చేస్తూ.. కాపు హక్కుల ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన అమరణ దీక్ష పదవ రోజుకు చేరుకుంది. దీంతో ఆయన అరోగ్యం ప్రాణాపాయ స్థితిలో వున్నారు. ఏ క్షణంలో ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితుల్లోకి జారుకున్నారు.. ఆయన అరోగ్య పరిస్థితి మరింతగా క్షీణిస్తుందని వైద్యులు అంటున్నారు. పదవ రోజు ఆయన శరీరంలో కీటోన్ల సంఖ్య మరింతగా పెరుగుతున్నాయని.. ఇవి ప్రమాదకర సంకేతాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముద్రగడతోపాటు కుటుంబ సభ్యులందరి మూత్రపిండాల్లో నిన్నటి ఉదయానికే కీటోన్స్ 4+గా నమోదైందని జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ టి.రమేశ్కిశోర్ తెలిపారు.
ఈ స్థితిలో రాజమహేంద్రవరంలోనే ఉంచి వైద్యం చేసినా ప్రాణాపాయమని వైద్యులు చెబుతున్నారు. దీంతో ఆయన అరోగ్య పరిస్థితి మళ్లీ ప్రమాద స్థాయికి చేరుకుంటుందని.. ఈ నేపథ్యంలో అయనకు ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వక తప్పనిసరి పరిస్థితి నెలకోందని వైద్యులు చెబుతున్నారు. ఆయన బీపి షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్ లో లేవని తెలుస్తుంది. ఇంకా ముద్రగడ దీక్షను చేపట్టడం ఆయన అరోగ్యరిత్యా మంచిది కాదని కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫ్లూయిడ్స్ పెడుతున్నా ముద్రగడ ఆరోగ్యాన్ని నియంత్రించడం కష్టమవుతోందని వైద్యులు చెబుతున్నారు. ముద్రగడతో పాటు కోడలు సిరి ఆరోగ్యం మరింత ఆందోళనకరంగా ఉంది. ఆమె నోట మాట రావడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబు సర్కార్ ముద్రగడ దీక్షపై వ్యవహరిస్తన్న తీరును కాపు నేతలు తీవ్రంగా దుయ్యబడుతున్నారు. మరోవైపు తుని ఘటనలో అరెస్టు చేసిన కాపు కులస్థులను తక్షణం విడుదల చేయాలని, వారిని విడుదల చేసే వరకు తన దీక్ష కోనసాగుతుందని ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. లెక్కకు ఒక్కరు తగ్గినా దీక్ష విరమించేది లేదని.. ఎన్నిరోజులైనా దీక్ష చేస్తానని.. ప్రాణాల కంటే ఇచ్చిన మాటే ముఖ్యమంటూ.. తన మానాన తనను వదిలేమని, అరెస్టు చేసిన వారందరినీ విడుదల చేసి తీసుకువచ్చి చూపించినప్పుడు మాత్రమే తాను దీక్ష విరమిస్తానని. అంతవరకు తనను బలవంత పెట్టొద్దని ఆయన చెప్పారు.
ముద్రగడ ఆరోగ్యం విషమించిందనే సమాచారం బయటకు రావడంతో గురువారం రాష్ట్రవ్యాప్తంగా కాపు ఉద్యమం మరింత ఎగసింది .గోదావరి జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో రాస్తారోకోలు, ధర్నాలు, యువకుల బైక్ ర్యాలీలు జరిగారుు. తుని ఘటనలో అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలనే డిమాండ్‌తో ఆమరణ దీక్ష చేస్తున్న ముద్రగడ ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ముద్రగడ వైద్య నివేదికలు అంతా సవ్యంగా వున్నాయని స్పష్టం చేయడం పట్ల మంత్రులు అవహేళన చేసేలా వ్యాఖ్యానించడాన్ని కాపు నేతలు తిప్పకోట్టారు.
ముద్రగడ అరోగ్యంపై హైదరాబాద్ అస్పత్రుల వైద్యులతో పరిక్షలు చేయించి నివేదికలు బహిర్గతం చేస్తే మంత్రుల మాటల్లో నిజమెంతో తెలిపోతుందని పేర్కోన్నారు. ముద్రగడకు ఏదైనా హాని జరిగితే.. టీడీపీ ఇక రాష్ట్రంలో కనుమరుగవ్వక తప్పదని కాపు నేతలు హెచ్చరిస్తున్నారు. ముద్రగడ ప్రాణాపాయ స్థితిలో వున్నారని తెలుస్తున్నా ఆయన అరోగ్యంతో ప్రభుత్వం అటటాడుతుందని విమర్శించారు. ఇచ్చిన హామీలను నేరవేర్చడానికి ఇష్టంలో పబ్బం గడుపుకునే నేతలు.. ఎన్నికల ముందు ఎలా హామీలను గుప్పించారని వారు దుయ్యబట్టారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more