China new slogan please donate sperm

ITEMVIDEOS:దేశం కోసం వీర్యం...

Posted: 06/17/2016 10:37 AM IST
China new slogan please donate sperm

చైనాలో ప్రజలకు ఆ దేశం కొత్త కాదు కాదు వింత పిలుపు ఇచ్చింది. దేశం కోసం ప్రాణాలు అర్పించండి అని చెప్పటం విన్నాం కానీ, వెరైటీగా వీర్యం దానం చేయడమేంటని అనుకుంటున్నారా? అవును ఆ దేశంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది.

అత్యధిక జనాభాతో ప్రపంచంలో మొదటిస్థానంలో ఉన్న చైనా ఇటీవలె రెండో సంతానం కోసం వారికి అనుమతి ఇచ్చింది. దీంతో అక్కడ జనాలు జనాభాను పెంచే పనిలో నిమగ్నమయ్యారు. ఈ హఠాత్ పరిణామంతో వీర్యం దొరక్క స్పెర్మ్ బ్యాంకులు ఇప్పుడు తెగ ఇబ్బందిపడిపోతున్నాయి. అందుకే ఓ ఆఫర్ ను ప్రకటించాయి.


source from Oneindia

20-45 ఏళ్ల లోపు ఉన్న ఎవరైనా సరే తమ వీర్యంను దానం చేస్తే నగదు ఇస్తామని ప్రకటించింది. వెయ్యి డాలర్ల క్యాష్ లేదా ఐఫోన్ ఇస్తామంటూ ఆకర్షనీయమైన ఆఫర్లు ఇస్తున్నాయి. అయినా స్పందన అంతంత మాత్రంగానే రావటంతో చివరకు దేశం కోసం... అంటూ ఓ నినాదాన్ని ఇచ్చిపడేశాయి. దీంతో దేశభక్త యువత స్పందించి వీర్యం డోనేట్ చేసేందుకు ముందుకు వస్తున్నారు.

ఇంకోందరైతే ఏకంగా వీర్యం, రక్తం రెండూ సమానమే అని, దానం చేస్తే ప్రజలకు ఉపయోగపడతాయంటూ కటింగ్ లు ఇచ్చేస్తున్నాయి. ఇంతకీ ఈ స్పెర్మ్ బ్యాంకుల పనేంటో తెలుసా? చైనా సాంప్రదాయ వైద్యానికి వీర్యానికి వినియోగిస్తుంటారు. డిమాండ్ లక్షల్లోనే ఉంటుందట, అందుకే అవి ఇంతలా ఎగబడుతున్నాయి.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles