తిండికి బట్టలకు సంబంధం లేదంట! | first naked restaurant launched in london

First naked restaurant launched in london

naked restaurant, london naked restaurant, Bunyadi naked restaurant, నగ్న రెస్టారెంట్, దిగంబర హోటల్, న్యూడ్ హోటల్, లండన్ ది బూనియా, బూనియా నగ్న హోటల్, తాజా వార్తలు, ఐటెం న్యూస్, తెలుగు వార్తలు, latest news, telugu news

A restaurant which allows diners to eat their meals completely naked opened in south London on Friday. Apart from offering its customers to "de-robe" in the dining area, the Bunyadi restaurant gives an entirely natural eating experience, with the food served raw and a blanket ban on the burdens of modern life, including phones and electricity. Customers dine under a canopy of candle lights, partitioned with bamboo and wicker. Gowns and changing rooms are offered for those who are stripping down, and no photography is allowed inside the restaurant.

ITEMVIDEOS: తిండికి బట్టలకు సంబంధం లేదంట!

Posted: 06/11/2016 11:20 AM IST
First naked restaurant launched in london

ఎప్పుడు బట్టలతో ఉండీ, ఉండీ బోర్ కొట్టడం లేదు. కనీసం మనశ్శాంతిగా తినే టైంలో అయిన దిగంబరంగా ఉండి చూడండి అంటోంది లండన్ లోని ఓ రెస్టారెంట్. కట్టుబాట్లను కాసేపు పక్కకు పెట్టి ఓపెన్ గా గడపండి అంటూ ఆఫర్ ప్రకటించింది. ది బునిదియా పేరుతో నెలకొల్పిన ఈ హోటల్ లండన్ లో శుక్రవారం అట్టహాసంగా మొదలైంది.

ఈ రెస్టారెంట్ లోకి ప్రవేశించాలంటే మొత్తం బట్టలు తీసేయాలి. ఫోటోలకు ఇందులో అనుమతి లేదు. ఆఖరికి ఫోన్లను సైతం పక్కనబెట్టాల్సిందే. ఇందులో కరెంట్ కూడా ఉండదు. మరెలా తింటారు అనుకుంటున్నారా? కేవలం కొవ్వొత్తుల వెలుగులో ప్ర్యతేకంగా ఏర్పాటు చేసిన టేబుళ్లపై కూర్చుని తినాలి. మట్టి కుండలు, ప్ర్యతేక చెంచాలు, ఆఖరికి వాష్ రూంలను కూడా ఓ ప్రత్యేక వాతావరణంలో రూపొందించారు. ఈ పూర్తి నగ్నంగానా? అని ఫీలయ్యే వాళ్ల కోసం పరిమితంగా బట్టలు వేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నారు. 16-60 ఏళ్ల లోపు, అది కూడా బరువు తక్కువ ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తారు.

కేవలం 42 మంది మాత్రమే కూర్చొనగలిగే ఈ రెస్టారెంట్ కి ఆన్ లైన్ బుకింగ్ సదుపాయం కూడా ఉంది. కాగా, ఇప్పటిదాకా 42,000 వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు ఎంతమందికి బట్టలు లేకుండా భోజంన చేయాలని తహతహలాడుతున్నారో... ఇంతకీ భోజనానికి అయ్యే ఖర్చు చెప్పలేదు కదా జస్ట్ 50 వేలు మాత్రమే. లోపలికి ప్రవేశించేప్పుడు మీ బరువును చెక్ చేస్తారు. పొరపాటున ఆన్ లైన్ లో చెప్పిందానికన్నా కాస్త ఎక్కువున్నా సరే వెనక్కి తరిమేస్తారు. పైగా డబ్బులు కూడా తిరిగి ఇవ్వరు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : naked restaurant  london naked restaurant  Bunyadi naked restaurant  

Other Articles