భాగ్యనగరం బెగ్గింగ్ బిజినెస్ అదుర్స్ | shocking monthly income earned by hyderabad beggars

Shocking monthly income earned by hyderabadi beggars

hyderabad beggars, beggars monthly income, 2 crores earned by beggers, telangana, GHMC beggers, తెలంగాణ బెగ్గర్స్, యాచకులు, ముష్టి ఆదాయం 2 కోట్లు, హైదరాబాదీ బెగ్గర్స్, తాజా వార్తలు, తెలంగాణ వార్తలు, తెలుగు న్యూస్, latest news, telugu news

shocking monthly income earned by hyderabad beggars. earned 2 crores for monthly and 24 crores for annum.

భాగ్యనగరం బెగ్గింగ్ బిజినెస్ అదుర్స్

Posted: 06/10/2016 01:44 PM IST
Shocking monthly income earned by hyderabadi beggars

అయ్యా ఓ రూపాయి... అమ్మా ఓ రూపాయి... బాబా ధర్మం అంటూ సిగ్నల్స్ దగ్గర, రోడ్ల పక్కన అడుక్కునే వాళ్లను చూసి జాలితో కరిగిపోయి ఓ రూపాయి చేయటం మనకు అలావటే. కానీ, గ్రేటర్ అధికారులు మాత్రం రెచ్చిపోయి అపర కర్ణుడిలా వాళ్లకి దానం చేయొద్దంటున్నారు. చచ్చినా వాళ్ల ప్లేట్ లో పైసా విదలచకండి అని చెబుతున్నారు. అధికారులు అంత కర్కోటకులా అనుకుంటున్నారా? లేదు లేదు. నానాటికీ భాగ్యనగరంలో యాచకులతోపాటు పెరిగిపోతున్నారు. అదే రేంజ్ లో వారి సంపాద‌న కూడా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో, న‌గ‌రంలో యాచ‌కులంతా క‌ల‌సి నెలకి రాబ‌ట్టే ఆదాయం వింటే మీ గుండె ఆగిపోతుంది.

నెలకి వారు సంపాదించే ఆధాయం అక్షరాల 2 కోట్లు. అంటే సాలినా వారు సంపాదించేంది 24 కోట్లు అన్నమాట. ఏ గ‌తీ లేక బిచ్చగాళ్లుగా మారిన వారు కేవ‌లం 2 శాత‌మేన‌ట‌. మిగ‌తా 98 శాతం దీన్ని ఒక వ్యాపారంగా తీసుకుని దిగార‌ంట‌. ఈ విష‌యాలను స్వయానా న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ మీడియాకు వెల్లడించారు. ఈ ముష్టి మాఫియాకు పుల్ స్టాప్ పెట్టేలా త్వరలో చర్యలు తీసుకోబోతున్నట్లు ఆయన వెల్లడించారు.

మరోవైపు ఈనెల 23న సంయుక్తంగా స‌మావేశం నిర్వహించి వారి పని పట్టేందుకు సిధ్ధమవుతున్నారు జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులు. అరబ్ దేశాల్లో యాచ‌క‌వృత్తిని తీవ్రనేరంగా ప‌రిగ‌ణిస్తారు. ఆ తరహాలో ఇక్కడ చట్టాలు తేవడం ద్వారా ఫలితం ఏమన్నా ఉంటుందా అని అధికారులు ఆలోచనలో పడ్డారు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh