జూలై 11 నుంచి రైళ్లు బంద్ ? No trains from July 11 and unions call for strike

No trains from july 11 and unions call for strike

No trains from July 11 and unions call for strike, July 11 trains strike, 40 lakh employees, railway strike, రైల్వే సమ్మె, జూలై 11 రైల్వే సమ్మె, తాజా వార్తలు, తెలుగు వార్తలు, రైల్వే యూనియన్ సమ్మె నోటీసులు, రైల్వే సంఘాలు, దక్షిణ మధ్య రైల్వే సమ్మె, latest news, telugu news

No trains from July 11 and unions call for strike. More than 40 lakh employees of railways going to strike. Since there was no progress so far in our meetings with the Railway Ministry, we will be going on indefinite strike from July 11,” union leader said.

జూలై 11 నుంచి రైళ్లు బంద్ ?

Posted: 06/09/2016 01:54 PM IST
No trains from july 11 and unions call for strike

సుమారు 42 ఏళ్ల తర్వాత భారతీయ రైల్వే సిబ్బంది సమ్మెకు సిద్ధమయ్యారు. జూలె 11 నుంచి దాదాపు 40 లక్షల మంది కార్మికులతో నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రైల్వేమెన్ ప్రకటించింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు రైల్వే ఉన్నతాధికారులకు సమ్మె నోటీసు ఇచ్చాయి. ఈ మేరకు గురువారం ఆయా రీజియన్ల పరిధిలోని కార్మిక సంఘాల ప్రతినిధులు ఎక్కడికక్కడ ఉన్నతాధికారులకు నోటీసులు అందజేశారు. సికింద్రాబాదులోని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ను కలిసిన కార్మిక సంఘాల ప్రతినిధులు కూడా సమ్మె నోటీసు ఇచ్చారు.

కొత్త పెన్షన్ స్కీమ్ పై రివ్యూ , ఏడవ వేతన కమిషన్ సిఫారసుల అమలు వంటి పలు డిమాండ్ లతో రైల్వే యూనియన్లు ఈ నిరవధిక బంద్ చేపట్టనున్నాయి. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించకుంటే... వచ్చే నెల (జూలై) 11 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని ఆ నోటీసుల్లో కార్మికులు హెచ్చరించారు. నోటీసు ప్రకారం జూలై 11 ఉదయం 6గంటలనుంచి 13లక్షల మంది రైల్వే వర్కర్లు సమ్మె పాటించనున్నారని ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ ఎస్ గోపాల్ మిశ్రా తెలిపారు.

ఏడవ వేతన సిఫారసు మేరకు కనీస వేతనం రూ.18,000 నుంచి రూ.26,000 కు పెంచాలని, ఈమేరకు ఆరు నెలల క్రితమే కేంద్రప్రభుత్వానికి సంబంధిత శాఖకు లేఖ పంపినట్లు మిశ్రా వెల్లడించారు. ఎన్ఎఫ్ఆర్ఐ, ఏఐఆర్ఎఫ్ రెండు యూనియన్లు కూడా ఈ నిరవధిక సమ్మెకు మద్దతు తెలుపుతున్నాయి. ఒకవేళ అతిపెద్ద దేశీయ రవాణా వ్యవస్థకు బ్రేకులు పడితే మాత్రం ఆ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles