శోభనం ముచ్చట తీరాక మొగుడిని ఏసేసింది | serial bride killed husband after first night

Serial bride killed husband after first night

bride, cheated husband, serial bride killed husband, bride killed groom after first night, తాజా వార్తలు, శోభనం తర్వాత చంపేసింది, యూపీ వార్తలు, తెలుగువార్తలు, latest news, telugu news

serial bride killed husband after first night in UP.

శోభనం ముచ్చట తీరాక మొగుడిని ఏంచేసింది...

Posted: 06/07/2016 11:19 AM IST
Serial bride killed husband after first night

పెళ్లి పేరుతో ఘరానా మోసాలు రోజూ మనం టీవీల్లో చూస్తుంటాం. ఒకరికి తెలియకుండా ఇంకోకరిని పెళ్లి చేసుకుని డబ్బుతో ఉడాయించే నిత్య పెళ్లి కొడుకుల ఉదంతాలు కోకోల్లలు. అయితే ఇక్కడ సీన్ మాత్రం రివర్స్ అయ్యింది. మూడు రాత్రులు గడిపాక శోభనపు మంచంపైన మొగుడిని శాశ్వతంగా పడుకోపెట్టింది ఓ ఇల్లాలు.

లక్నోకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నిర్మల్ కు ఓ మ్యారేజ్ బ్యూరో ద్వారా తారతో వివాహం సెటిల్ అయ్యింది. పేరుకు తగ్గట్లే తార చాలా అందగత్తె. ఎన్నో ఆశలతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన నిర్మల్ కు మూడు రాత్రులు బాగానే గడిచింది. ఇక మొగుడితో మోజు తీర్చుకున్న తార దారుణానికి తెగబడింది. అంతకు ముందే పాలలో విషం కలిపి అతనికి ఇచ్చింది. తీరా అతను నిద్రలోకి జారుకోగానే నగలు, డబ్బుతో ఉడాయించింది. తెల్లవారగానే గదిలోకి వచ్చి చూసిన అతని తల్లి కొడుకు నురగలు కక్కి విగతజీవిగా పడి ఉండటం చూసి షాక్ కి గురయ్యింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను ఈలోకాన్ని విడిచివెళ్లాడని వైద్యలు చెప్పారు. ఇక అసలు విషయం అర్థం అయిన నిర్మల్ పెరేంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి ఫోటోల ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.

నిర్మల్ కు సంబంధం చూపించిన మ్యారేజ్ బ్యూరో దగ్గరి నుంచి ఆమె తల్లిదండ్రులుగా, చుట్టలుగా నటించిన వారంతా జూనియర్ ఆర్టిస్ట్ లే. మోసం గురించి అర్థమై, అప్రమత్తమైన పోలీసులు సమీపంలోని ఓ రైల్వే స్టేషన్లో ఆమెను పట్టుకోగలిగారు. అసలు ఆమె పేరు తారనే కాదంట. ఉత్తరాఖండ్ కి చెందిన రూబీనా పేరు మార్చుకుని ఇలా రోజుకో పెళ్లి చేసుకుని, వారితో మూడు రాత్రుల ముచ్చట తీర్చుకునేదంట. ఆపై తాపీగా నగదు, డబ్బుతో ఉడాయించేదని విచారణలో తేలింది. అయతే నిర్మల్ దగ్గరికొచ్చేసరికి ఆమె ప్రవర్తన పై అతనికి అనుమానం వచ్చిందట. అందుకే అతడిని చంపేశానని చెబుతోంది రూబీనా అలియాస్ తార. దురాశతో ఓ అమాయకుడి జీవితాన్ని అర్థాంతరంగా ముగించేసిన ఈ నిత్య పెళ్లి కూతురు ఇప్పుడు ఊచలు లెక్కిస్తోంది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles