జనగణమనను అవమానించిన మాజీ సీఎం | Farooq Abdullah insult national anthem

Farooq abdullah insult national anthem

JAMMU EX CM, FAROOQ ABDULLAH , NATIONAL ANTHEM , ఫరూక్ అబ్దుల్లా, జాతీయ గీతం, జనగణమన, నేషనల్ న్యూస్, రాజకీయాలు, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, NATIONAL NEWS, POLITICS, LATEST NEWS

National Conference chief Farooq Abdullah was on Friday caught on camera talking on phone during the national anthem at Trinamool Congress (TMC) chief Mamata Banerjee's swearing-in ceremony as the West Bengal Chief Minister.

జనగణమనను అవమానించిన మాజీ సీఎం

Posted: 05/27/2016 06:27 PM IST
Farooq abdullah insult national anthem

నేతల వ్యక్తిగత జీవితాలు ఎలా ఉన్నా, ఒకరిపై ఒకరు చేసుకునే దూషణల పర్వం శృతి మించినా మనకు సంబంధం లేదు. అసలు అక్కర్లేదు కూడా. కానీ, రాజ్యాంగాన్ని, చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత మాత్రం వారికి తప్పకుండా ఉంది. అలాంటిది ఓ పార్టీ అధినేత, సీనియర్ పొలిటిషియన్, పైగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉండి జాతీయ గీతాన్ని అవమానించిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది.  

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ శుక్రవారం ప్రమాణం చేశారు. పలువురు సీనియర్ కీలక నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమం చివర్లో జనగనమణ ఆలపించినప్పుడు వారంతా లేచి నిల్చున్నారు. అయితే అంతా జాతీయగీతం ఆలపించడంలో నిమగ్నమై ఉండగా, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, జమ్ము మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా మాత్రం ఫోన్ లో బిజీగా కనిపించారు. ఈ వీడియో షోషల్ మీడియాకు ఎక్కడంతో ఇప్పుడు వివాదం చెలరేగుతోంది. లాలూప్రసాద్ యాదవ్ ప్రక్కన కూర్చున్న ఆయన అందరితోపాటే లేచి నిల్చునుప్పటికీ ఫోన్ లో మాట్లాడుతూ కనిపించారు. జాతీయ మీడియాలో సైతం వరుస కథనాలు వస్తుండటంతో పలువురు నేతలు ఆయన చర్యపై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల శ్రీనగర్ లో ఓ పరేడ్ సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో ఇద్దరు జర్నలిస్టులు జాతీయ గీతాలాపన సమయంలో లేచి నిలబడకపోవడంతో వారిని అధికారులు కార్యక్రమం నుంచి బయటకు పంపేసిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : FAROOQ ABDULLAH  NATIONAL ANTHEM  TALKING ON PHONE  MAMATA BANERJEE  OATH TAKING  CEREMONY  

Other Articles