బడి కోసం అమ్మ డాన్స్ షో | amma dance for school

Amma dance for school

amma dance for school, Jayalalitha Dance, Jayalalitha Programmes, Jayalalitha latest news, Jayalalitha helps, Jayalalitha stills, Jayalalitha politics, politics, news, జయలలిత, రాజకీయాలు, తమిళనాడు, entertainment

amma dance for school: Jayalalitha Dance Show 50 Years Ago Helped Build This Karnataka School. Hundreds of people at Naguvinahalli village in Karnataka were glued to their TV sets earlier this week enthusiastically watching J Jayalalithaa sworn in as chief minister of Tamil Nadu.

బడి కోసం అమ్మ డాన్స్ షో

Posted: 05/26/2016 10:50 AM IST
Amma dance for school

తమిళనాడు-కర్ణాటక ఇరు రాష్ట్రాల మధ్య కావేరి జలాలు పెట్టిన చిచ్చు ఇప్పటికీ రగులుతూనే ఉంది. అందుకే కన్నడగుడిలకు తమిళ నేతలు అంటే చెప్పలేని మంట. అలాంటిది నిన్న జరిగిన తమిళనాడు ఎన్నికలపై కర్ణాటకలోని ఓ ప్రాంత ప్రజలు ఆసక్తిగా తిలకించారు. మాండ్యా జిల్లాలోని నాగువినాహల్లి ప్రాంత ప్రజలకు జయలలిత అంటే చెప్పలేని అభిమానం. అందుకే ఎన్నికలు మొదలైనప్పటి దగ్గరి నుంచి ఫలితాలు వెలువడే దాకా టీవీలకు అతుక్కిపోయారు అక్కడి జనాలు. ఆమె గెలవగానే సంబరాలు చేసుకున్నారు కూడా.  ఎందుకంటారా?

సరిగ్గా 50 ఏళ్ల క్రితం ఆ ఊళ్లో స్కూల్ లేక చాలా అవస్థలు ఎదుర్కునే వారంట. బడి నిర్మాణం కోసం విరాళాలు పోగు చేసేందుకు ఓ డాన్స్ షో నిర్వహించాలని అనుకున్నారంట. జయలలితకు సరిగ్గా అప్పుడు 19 ఏళ్లు. కెరీర్ లో అప్పుడే పీక్ స్టేజీలో ఉంది. వెంటనే చారిటీ నిర్వాహకుడు రామచంద్రయ్య జయలలితను సంప్రదించడం, ఆమె వెంటనే ఒప్పుకోవటం, డాన్స్ షో నిర్వహించటం, స్కూల్ కట్టేయడం చకచకా జరిగిపోయాయి. ‘‘ఆ సంఘటనను ఎలా మరిచిపోగలం. ఇప్పుడు మా ఊళ్లో బడి ఉందంటే, అందుకు జయ అందించిన సహకారమే కారణం. ఆమెకు మా కృతజ్ణతలు అంటూ 80 ఏళ్ల రామచంద్రయ్య గుర్తుచేసుకుంటున్నాడు.

నిజానికి జయలలిత పుట్టింది కర్ణాటకలోనే. 1948లో మైసూర్ లోని చెలువంబ ఆస్పత్రిలో ఆమె జన్మించారు. ఆమెకు 12 ఏళ్లు రాగానే ఆమె బందువు, నటి అయిన వింధ్య ఆమెను తమిళనాడుకు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి ఆమె సినీ ప్రస్థానం మొదలైంది. కన్నడ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ తమిళ తంబీలు పెద్ద మనసుతో ఆమెను అక్కున చేర్చుకుని ఆరుసార్లు ముఖ్యమంత్రిని చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jayalalitha  Tamilnadu Politics  Karnataka News  

Other Articles