who visits temples, who take ayyappa swamy diksha.?

Chandrababu controversial comments on temples and pilgrims

AP chief minister, chandrababu naidu, controversial comment, chandrababu controversial comments, naidu comments on temples and devotees, cbn controversial comments on temples, pilgrims fury on cbn, pilgrims fury on cm naidu

AP chief minister chandrababu naidu controversial comments on temples and devotees make pilgrims fury.

ఆలయాలకు ఎవరు వెళ్తారు..? ఆయప్ప దీక్ష ఎందుకు చేస్తారు..?

Posted: 05/26/2016 07:53 AM IST
Chandrababu controversial comments on temples and pilgrims

ఆలయాలకు ఎవరు వెళ్తారు..? అయప్ప దీక్ష ఎవరు చేపడతారు..? అంటే భయం భక్తి, దేవుడి పట్ల అరాధన అని ఠక్కున చెబుతారు. అయితే మన ముఖ్యమంత్రి గారు మాత్రం ఆలయాలకు ఎవరు వెళ్తారన్న విషయంలో మాత్రం కొత్త నిర్వచనం చెబుతున్నారు. ఎక్కువ తప్పులు చేసేవారే ఎక్కువగా గుళ్లకు వెళుతున్నారని అన్నారు. ఎక్కువ తప్పులు చేసి హుండీలో ఎక్కువ డబ్బులు వేస్తున్నారని చెప్పారు. అందుకే రాష్ట్రంలో దేవాలయాల ఆదాయం బాగా పెరుగుతోందని అన్నారు. ప్రజలకు కష్టం వస్తే దేవాలయాలకు వెళుతున్నారని, కష్టం రానంత వరకు ప్రజలకు దేవుళ్లు గుర్తుకు రావడం లేదన్నారు.

అంతేకాదు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునేవాళ్లను కూడా ఆయన అవమానించేలా వ్యాఖ్యలు చేశారు. మరోలా చెప్పాలంటూ అప్పయ్య దీక్ష చేపట్టే వాళ్లందరూ తాగుబోతులన్న రీతీలో ఆయన వ్యాఖ్యలు వున్నాయి.  మద్యం తాగకుండా ఉండడం కోసం అయ్యప్ప దీక్ష చేస్తున్నారని, ఆ 40 రోజులు మద్యం అమ్మకాలు తగ్గిపోతున్నాయని వ్యాఖ్యానించారు. అయితే అధికారులు కష్టపడకపోయినా రాష్ట్ర ఆదాయంలో 27 శాతం దేవాదాయ శాఖ నుంచే వస్తోందని చెప్పారు. చర్చిలు, మసీదులు, దేవాలయాలు లేకపోతే చాలామందికి పిచ్చి పట్టేదన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అటు దేవాలయాల ప్రవిత్రతను, భక్తుల నమ్మకాన్ని మసకబార్చి, అపఖ్యాతిని అపాదించేలా ఆయన వ్యాఖ్యలు దోహదం చేస్తున్నాయని పలువురు మండిపడుతున్నారు. దైవాంష్ పుట్టిన సందర్భంగా ఏలాంటి తప్పులు చేశాడని చంద్రబాబు తిరుపతికి వెళ్లారని, ఆయన మనవడికి తలనీలాలు సమర్పించడం కోసం చిత్తూరు నాగులమ్మ దేవాలయనాకి ఎందుకు వెళ్లారని, ఆయన ఎన్ని తప్పులు చేశారని కూడా పలువురు ప్రశ్నిస్తున్నారు. భక్తుల నమ్మకాలతో ప్రభుత్వాలు అడుకోరాదని, ఇప్పటికైనా ఈ దోరణి విడనాడాలని లేని పక్షంలో తగిన గుణపాఠం తప్పదని పలువురు భక్తులు హెచ్చరిస్తున్నారు.  

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles