అప్పుడే స్పీడు పెంచిన జయలలిత | TamilNadu CM Jayalalitha may allot cabinet ministries to ministers

Tamilnadu cm jayalalitha may allot cabinet ministries to ministers

Jayalalitha, Tamilnadu, Cabinet, Roshaiah, తమిళనాడు, రోశయ్య, జయలలిత

TamilNadu CM Jayalalitha may allot cabinet ministries to ministers. Jayalalitha sent a proposal to Governor Roshaiah on this issue.

అప్పుడే స్పీడు పెంచిన జయలలిత

Posted: 05/24/2016 07:28 AM IST
Tamilnadu cm jayalalitha may allot cabinet ministries to ministers

రాష్ట్రానికి ఆరోసారి ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణం స్వీకారం చేసిన జయలలిత ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనంగానే ఉంటుంది. ఆమె రూటే సెపరేట్ అనే విధంగా ఆమె వ్యవహరించే తీరు ఉంటుంది. సోమవారం సీఎం ప్రమాణ స్వీకారం చేసిన ఈ అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఎవరూ ఊహించని విధంగా ఓ నిర్ణయం తీసుకున్నారు. జయలలిత, తన కేబినెట్ ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటలకే మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయించారు. జయ మంత్రివర్గంలో మరో నలుగురికి స్థానం కల్పించనున్నారు.

ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్యకు ఆమె జాబితాను పంపించారు. కొత్తగా కేబినెట్-లోకి తీసుకునే వారితో గవర్నర్ రోశయ్య మంగళవారం ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అమ్మ కేబినెట్ లో కొత్తగా బెర్తులు దొరికిన వారిలో జీ. భాస్కరన్, ఎస్.రామచంద్రన్, నిలోఫర్ కబిల్, పి.బాలకృష్ణారెడ్డి ఉన్నారు. నిన్నమధ్యాహ్నం జయతో పాటు మొత్తం 28 మంది మంత్రులు ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. కొత్తగా మంత్రులు అవుతున్న వారితో కలిపి జయ కేబినెట్ పరిధి 32కు పెరగనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles