Marriage in evening, divorce by morning

Groom divorces bride after hours of marriage

Karonda Pachdu village, Chandpuron village, Bijnor district, Imran, groom divorces bride hours after marriage, Wedding, Divorce, Kaari Imran, Nasir Ahmed, Rs 1.45 lakh stolen, talaq, uttar pradesh

In one of the quickest of divorces, a man divorced his wife after an alleged theft case in Bijnor district.

సాయంత్రం పెళ్లి.. తెల్లారక విడాకులు.. గంటల వ్యవధిలోనే తెగిన పవిత్రబంధం..

Posted: 05/18/2016 12:45 PM IST
Groom divorces bride after hours of marriage

పెళ్లంటే నూరేళ్ల బంధమని ప్రపంచ వ్యాప్తంగా అందరూ విశ్వసిస్తున్నా.. చిన్న చిన్న కారణాల చేత పెళ్లిని పెటాకుటు చేసుకుంటున్న వారి సంఖ్య అరబ్ దేశాలతో పాటు సంపన్న కుటుంబాలలో కూడా సర్వసాధరణమైపోయింది. అయితే సామన్య మధ్యతరగతి కుటుంబాలలో మాత్రం ఇలాంటివి చాలా అరుదు. అందులోనూ మన దేశంలో మాత్రం ఇంకా అరుదు. కానీ పెళ్లైన నూతన వధూవరులు కేవలం గంటల వ్యవధిలోనే వారి పవిత్ర బంధాన్ని పెళ్లికొడుకు తెంచుకున్నాడు. అందుకు అతనితో పాటు అతని తల్లిదండ్రులు అనువించిన నరకమే కారణమని వరుడి తరపు బంధువులు చెబుతున్నారు.

గంటల వ్యవధిలోనే పవిత్రంగా జరిగిన పెళ్లి తంతు తెగిన బంధంగా మారింది. పెళ్లికూతురు తరఫు వాళ్లు తీసుకొచ్చిన రూ.1.45 లక్షల నగదు, విలువైన ఆభరణాలు పెళ్లిలో పోవడంతో సాయంత్రం పెళ్లి చేసుకుని, మర్నాటి ఉదయం విడాకులు తీసుకున్న ఘటన జిల్లాలోని కారోండు పచ్చూ గ్రామంలో చోటుచేసుకుంది. వరుడి తరఫు వ్యక్తే డబ్బు, ఆభరణాలు దొంగిలించారని పెళ్లికూతురి తరఫు వాళ్లు ఆరోపించడంతో కోపోద్రిక్తుడైన వరుడు వధువుకు విడాకులు ఇచ్చాడు.

కారోండు పచ్చూ గ్రామానికి చెందిన ఇమ్రాన్ ఖాన్‌కు పొరుగు గ్రామంలోని నసీర్ అహ్మద్ కూతురితో వివాహం నిశ్చయమైంది. పెళ్లి కోసం మండపం వద్దకు తీసుకొచ్చిన రూ.1.45 లక్షల నగదు, విలువైన ఆభరణాలు పోవడంతో నసీర్ అహ్మద్.. వరుడి బంధువులే ఈ దొంగతనం చేశారని ఆరోపించారు. వరుడిని, అతని తండ్రిని రాత్రంతా నిర్బంధించారు. విషయం తెలుసుకున్న పోలీసులు జోక్యం చేసుకుని ఇరువురిని విడిపించారు. ఈ అవమానాంతో కోపగించిన వరుడు వధువుకు విడాకులు ఇచ్చాడు.

ఇంటికి చేరుకున్న రెండు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం తలెత్తింది. వరుడి మేనల్లుడు, వేరే మహిళ ఇద్దరూ కలిసి దొంగతనం చేశారని నసీర్ అహ్మద్ ఆరోపించడంతో వధువు తరఫు వాళ్లే వరుడి బంధువులతో తప్పుగా ప్రవర్తించారని అన్నారు. గ్రామస్తుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరు కుటుంబాలను స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. ఎస్సై శివకుమార్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు రెండు కుటుంబాల్లో ఏ ఒక్కరూ కూడా ఫిర్యాదు చేయలేదని తెలిపారు. రాజీ కోసం ప్రయత్నిస్తున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bijnor district  Imran  Karonda Pachdu village  uttar pradesh  

Other Articles