woman complaints to police on co-passengers molest

Women passenger alleges on co passenger molest

woman molested, planes, ragiv gandhi international airport, vijayawada corperator, chintoo, banglore-hyderabad bound flight, Indigo flight, domestic services, co passenger, woman molested in indigo flight, woman passengers, molest in flights, molestation on women, harrassemnt on women, police

A police complaint has been filed against Indigo passenger as his co passenger alleges that he molested her.

విమానయానంలోనూ మహిళకు తప్పని లైంగిక వేధింపులు

Posted: 05/15/2016 01:23 PM IST
Women passenger alleges on co passenger molest

అడది కనబడితే చాలు.. వెర్రి వేషాలు వేసే వారు మగమృగాళ్లకు కొదవేమీ లేదు ఇలలో. అది ఏ దేశమైనా సరే.. మహిళలను విలాస వస్తువుగా చూసే వారి సంఖ్యకు కూడా కొదవలేదు. ఇప్పటి వరకు భూమ్మిద తిరిగే అడవారే ఈలాంటి లైంగిక వేదింపులను ఎదుర్కోన్నారు. కానీ తాజగా గగనతలంలోనూ మహిళలు మగవారి వికృత చేష్టలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళా ప్రొఫెసర్‌తో విజయవాడ టీడీపీ కార్పొరేటర్ అసభ్యకర ప్రవర్తన వెలుగులోకి వచ్చిన తరువాత అదే రోజున మరో ఘటన కూడా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు ఇండిగో విమానంలో వస్తుండగా తన పక్కసీట్లో కూర్చున్న వ్యక్తి సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీస్తూ వికృతంగా ప్రవర్తించినట్లు ఓ మహిళ శనివారం ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రయాణం చేస్తున్నంతసేపూ అతడి ప్రవర్తనతో విసిగిపోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నా.. అధికారికంగా ధ్రువీకరించలేదు. ఏడాది కిందట మద్యం మత్తులో విమానంలోని ఎయిర్‌హోస్టెస్ పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. అలాగే తోటి ప్రయాణికురాలితో మరో వ్యక్తి కూడా అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలపై ఫిర్యాదులందాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles