ఆస్పత్రిలో చిందులు.. రోగుల అవస్థలు | Minor girls made to dance inside Mumbai hospital during cultural fest

Minor girls made to dance inside mumbai hospital during cultural fest

Mumbai, Hospital, Hospital Staff, ముంబై, ఆస్పత్రి

Amid growing concern over the exploitation of children, a hospital in Mumbai made minor girls dance as part of its cultural fest. The footage of the incident released by news agency ANI shows three young girls performing Lavani dance at the OPD of a civic hospital. The incident is said to have occurred on March 2.

ITEMVIDEOS: ఆస్పత్రిలో చిందులు.. రోగుల అవస్థలు

Posted: 05/11/2016 01:44 PM IST
Minor girls made to dance inside mumbai hospital during cultural fest

అదో హాస్పిటల్ అక్కడ రోగులకు చికిత్స జరుగుతుంది. కానీ ఓ రోజు మాత్రం ఆస్పత్రి కాస్తా.. క్లబ్ లాగా మారింది. రోగుల చెవులకు చిల్లులు పడేలా మ్యూజిక్ తో డ్యాన్సులు, అరుపులు. దాంతో రోగుల తరఫు బంధువులు భయపడ్డారు. ఇదేంటి మామూలుగా అయితే ఏ ఆస్పత్రిలో అయినా రోగులకు చికిత్స మాత్రమే అందిస్తారు కదా.. మరేంటి చిందులు వేసినట్లు రాసారు అని అనుకుంటున్నారేమో. ముంబై మహానగరంలోని ఆస్పత్రిలో చోటుచేసుకున్న విడ్డూరం ఇది.

ముంబైలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో మ్యూజిక్, డాన్స్లతో హోరెత్తించారు. సిబ్బంది ఆస్పత్రిని ఏకంగా ఫంక్షన్ హాల్లా మార్చేసి.. రోగులకు చుక్కుల చూపించారు. అసలే ఆరోగ్యం బాగేలేక ఆస్పత్రికి వస్తే ఇక్కడ మాకేంటి బాధలు అని వారు తిట్టుకున్నారు. పైగా కల్చరల్ ప్రోగ్రాం పేర్లతో మైనర్ బాలికలతో డ్యాన్స్ లు కూడా చేయించారు. ఆస్పత్రిలో రోగులకు అసౌకర్యం కలుగుతుందన్న కనీస ఇంగితక జ్ఞానం కూడా లేకుండా సంబరాలు చేసుకున్నారు. వైద్య సిబ్బంది నిర్వాకం చూసి రోగులు అవాక్కయ్యారు. డాన్స్ చేస్తున్న దృశ్యాలను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. దీని మీద అధికారులు విచారణకు ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mumbai  Hospital  Hospital Staff  ముంబై  ఆస్పత్రి  

Other Articles