కృష్ణా జిల్లాలో బిర్యానీ బాబా | Attaullah Shariff Khadiri a Biryani Baba

Attaullah shariff khadiri a biryani baba

Biryani Baba, Attaullah Shariff Khadiri, AP, Krishna Dist, బిర్యానీ బాబా, బాబా, క్రిష్ణ జిల్లా

Spiritual preacher, Attaullah Shariff Khadiri, has earned the nickname of ‘Biryani Baba’. The cleric has fed more than 1 crore poor since the past 40 years. The needy people are not just served a square meal, but a delicious chicken or mutton biryani. An alternative dish is prepared for vegetarians too.

కృష్ణా జిల్లాలో బిర్యానీ బాబా

Posted: 05/09/2016 04:14 PM IST
Attaullah shariff khadiri a biryani baba

తన్నుల బాబా.. నిమ్మకాయల బాబా ఇలా రకరకాల బాబాల గురించి వినే ఉంటారు కానీ బిర్యానీ బాబా గురించి విన్నారా..? ఓహో బిర్యానీ బాబా అంటే ఆయనకు బిర్యానీ ఇస్తే పని చేస్తాడా అని అనుకుంటున్నారేమో కాదు కాదు.. బిర్యానీ మనకే పెట్టిస్తాడు. అవును 79 ఏళ్ల ఈ అత్తవుల్లా షరీఫ్ షతాజ్ ఖాదిరి బాబా అలియాస్ బిర్యానీ బాబా 40 ఏళ్లుగా తన దగ్గరకు వచ్చినవారికి బిర్యానీ తినిపిస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా ఈయనది 40 ఏళ్ల క్రితం మరణించిన తన గురువు ఖాదర్ బాబా వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడాయన ; ‘‘నాదేముంది? ఆకలితో ఉన్నవారికి, అవసరమున్నవారికి భోజనం పెడుతున్నాను. అంతే కదా, దానికి భక్తులు, దాతలు విరాళాలిస్తున్నారు’’ అంటాడాయన వినయంగా

చీమలపాడు దర్గాలోని లంగర్ ఖానాలో ఒక్క మతమని ఏమీ లేదు, ఎవరొచ్చినా కడుపు నింపడమే తన ధ్యేయమంటాడు ; ‘‘మానవసేవే దేవుడి సేవ అని నమ్ముతాను నేను  ఆకలికి కులాలు, మతాలు లేవు; ఎవరైనా ఒకటే, నేను జనానికి కూడా చెప్పేది ఒకటే; పేదల పట్ల ప్రేమను కలిగి ఉండండి;’’ అన్నాడు ఈ బిర్యానీ బాబా . రోజూ ఆయన ఆశీస్సుల కోసం దాదాపు 1000 మంది దాకా వస్తుంటారు; కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అది 10 వేల వరకూ ఉంటుంది; అక్కడికి వచ్చేవారికి బిర్యానీ పెడతారు; ఈయన బిర్యానీ సంతర్పణకు సగటున రోజూ రెండు టన్నుల బాస్మతి బియ్యం, క్వింటాళ్ల కొద్దీ చికెన్, మటన్, నెయ్యి అవసరమవుతాయి; కేవలం శాఖాహారమే కావాలనుకున్నవారికి అదీ ఉంటుంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles