పనామాలో అజయ్ దేవ్ గణ్, కాజల్ | Ajay devgan and Kajol in Panama papers

Ajay devgan and kajol in panama papers

Ajay Devgan, Kajol, Panama Papers, Bollywood, Ajay Devgan in Panama papers, అజయ్ దేవ్ గణ్, కాజోల్, పనామా పేపర్స్

Actor-entrepreneur Ajay Devgan, born Vishal Veeru Devgan, bought over the entire shareholding of a British Virgin Islands (BVI) company Marylebone Entertainment Limited in 2013, claiming it was done to acquire and exploit overseas rights of Hindi films.

పనామాలో అజయ్ దేవ్ గణ్, కాజల్

Posted: 05/04/2016 04:29 PM IST
Ajay devgan and kajol in panama papers

సంచలనం రేపిన పనామా పేపర్స్‌ లో తాజాగా మరో బాలీవుడ్‌ జంట  పేరు బయటకు వచ్చింది. ఇప్పటికే బాలీవుడ్‌ నటులు అమితాబ్‌బచ్చన్‌, ఐశ్వర్యారాయ్‌ పేర్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇండియన్‌ ఎక్స్-ప్రెస్‌  రిపోర్ట్‌ ప్రకారం.. అక్రమంగా డబ్బు కూడబెట్టిన వారి జాబితాలో అజయ్‌ దేవగణ్, కాజోల్  పేరు కూడా ఉంది. అజయ్‌ దేవగణ్‌ బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్‌కు చెందిన మారైలీబోన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీకి చెందిన వెయ్యి షేర్లు కొన్నట్లు సమాచారం. అజయ్‌ దేవగణ్‌, ఆయన సతీమణి బాలీవుడ్‌ నటి కాజోల్‌లకు చెందిన నైసా యుగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అనే కంపెనీ పేరుతో ఈ షేర్లు కొన్నట్లు తెలుస్తోంది. 2013లో దేవగణ్‌ ఈ కంపెనీ డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకొని 2014లో  దాని నుంచి తప్పుకొన్నారట.

దీనిపై అజయ్‌ దేవగణ్‌ స్పందిస్తూ.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి ఆర్‌బీఐ నిబంధనల ప్రకారమే పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు. దీనికి సంబంధించి అన్నీ సవ్యంగా ఉన్నాయని, ట్యాక్స్‌ రిటర్న్స్‌ కూడా చేశామని చెప్పారు. పనామాకు చెందిన ఓ న్యాయ సంస్థ పత్రాలు లీకై ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ప్రముఖులు, దేశాధినేతలు బోగస్‌ కంపెనీల పేరుతో అక్రమంగా డబ్బు కూడబెట్టుకున్నట్లు వివరాలు బయటపడిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles