'How to say thermodynamics in Sanskrit?' Smriti Irani’s new plan for the IITs sparks mirth

Sanskrit in iits sisodia vs smriti irani makes twitter explode

Smriti Irani, Sanskrit, Sanskrit compulsory in IITs, Twitter, Sanskit in IITs, IIT sanskrit,Manish Sisodia,Sanskrit,RSS agenda

It started as an innocuous social media taunt by one politician to another but soon devolved into a bizarre Twitter fight that brought out the tech geeks and possibly even inspired an online love story.

నాలుక కరుచుకున్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ.. మండిపడుతున్న ట్విట్టరైట్లు

Posted: 04/28/2016 07:39 PM IST
Sanskrit in iits sisodia vs smriti irani makes twitter explode

కేంద్ర విశ్వవిద్యాలయాలన్నింటిలో సంస్కత భాషను విధిగా నేర్పాలంటూ ప్రతిపాదన తీసుకొచ్చి చేతులు కాల్చుకున్న కేంద్ర మానవ వనరుల అభివద్ధి శాఖ మంత్రి స్మతి ఇరానీని ట్విట్టరైట్లు వ్యంగంగా విమర్శలు సంధిస్తున్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించిన దక్పథాల గురించి తెలుసుకునేందుకు సంస్కత భాష ఎంతో దోహదపడుతుందని అమె చెప్పడంపై తమ సోషల్ మీడియాలో టెక్కీలతో పాటు పలువురు విసుర్లు విసురుతున్నారు. దేశంలోని ఐఐటీలను సంస్కత భాషను బోధించాల్సిందిగా ఐఐటీయన్ల విజ్ఞప్తి చేశారని చెప్పడంతో కేంద్రమంత్రిపై సోషల్‌ మీడియా, ముఖ్యంగా ట్విట్టర్‌లో చలోక్తులు పేలుతున్నాయి.

‘స్మతి ఇరానీ ముందుచూపు మూర్ఖులకు ఎప్పటికీ అర్థం కాదు, టైమ్‌ మిషన్‌లో ప్రాచీనకాలంలోకి వెళ్లినప్పుడు సంస్కత భాష ఎంతగానో పనికొస్తుంది అని ఒకరు వ్యంగ్రస్త్రాలు సంధించగా, థర్మో డైనమిక్స్‌ను సంస్కతంలో ఏమంటారు? అని మరోకరు, హెచ్‌2ఓ ఫార్ములాను ఇలా రాయాలి అని ఇంకోకరు.. హైడ్రోవరణం ద్వి ఆక్సీవరణం ఎలా రాయాలి అంటూ ట్విటరట్లు రియాక్టయ్యారు. సీప్లస్‌ప్లస్, జావా, సోల్, పైథాన్, జావా స్క్రిప్టు లాంటి కంప్యూటర్‌ భాషలను ఒక్క సంస్కతం మాత్రమే ఎదుర్కోగలదని, హెచ్‌ఆర్‌డీ మినిస్ట్రీ అంటే హిందూ రాష్ట్ర డెవలప్‌మెంట్‌ మినిస్ట్రీ అనుకుంటున్నట్లుందని విమర్శలు కురిపించారు. ఐఐటీలో సంస్కతం నేర్పడం ఎంతమంచిదో ఇప్పుడర్థం కాదు. అది నేర్చుకునేటప్పుడు తెలుస్తుందని విమర్శించారు.

ఇంజనీరింగ్‌ అంటే గ్రీక్, లాటిన్‌ అని.....ట్విట్టర్‌ ఇండియాను సంస్కతంలో ఆపరేట్‌ చేయాల్సిందిగా ఆదేశించాలి లేదా సంస్కత ట్విట్టర్‌ను అభివద్ధి చేయాల్సిందిగా ఐఐటీ విద్యార్థులను కోరాలి....ఐఐటీల్లో సంస్కతం నేర్పడం భేష్‌. ఆ తర్వాత విద్యార్థుల హస్తవాసి చూసి మార్కులు వేయొచ్చు....’ఇలా ఎవరికి వారు తమదైన శైలిలో వ్యాఖ్యానాలు చేయగా, న్యూటన్స్‌ చలన సూత్రాలను ఎలా రాయాలో తెలియక తికమకపడుతున్న ఐఐటీ విద్యార్థులను చూసి పగలబడి నవ్వుతున్న స్మతి ఇరానీ అంటూ ఆమె నవ్వే చిత్రాన్ని ఒకరు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Smriti Irani  Sanskrit in IIT  Manish Sisodia  Sanskrit  RSS agenda  

Other Articles