Paresh Rawal violates odd-even, later apologises for 'blunder'

Bjp lawmaker paresh rawal apologises for odd even violation

paresh rawal, paresh rawal odd even, paresh rawal violates odd eve, paresh rawal parliament, bjp, arvind kejriwal, parliament sessions, special DTC bus service, MPs, odd even system, Delhi

BJP MP Paresh Rawal on Monday violated the odd-even rule by reaching the Parliament in his even-numbered car

వాళ్లకు నిబంధనలు వర్తించవా..? మినహాయింపు ఇవ్వాలని ఎంపీల వినతి..

Posted: 04/25/2016 06:49 PM IST
Bjp lawmaker paresh rawal apologises for odd even violation

ఢిల్లీలో వాహనాల ద్వారా వెలువడే కాలుష్యాన్ని తగ్గించే క్రమంలో కేజ్రీవాల్ ప్రభుత్వం సరి-బేసి విధానాన్ని స్వయంగా పార్లమెంటు సభ్యులే అతిక్రమించారు, అధికారపక్షానికి చెందిన పార్లమెంటు సభ్యుడు, సినీనటుడు పరేష్ రావల్ ఉల్లంఘించారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన ఇవాళ ఉదయం పదిన్నర గంటలు దాటిన తర్వాత పార్లమెంట్ వైపునకు నారింజపండు రంగులోని ఓ కారు సర్రున దూసుకొచ్చింది. రిజిస్ట్రేషన్ నంబర్ డీఎల్ 9 సీఏ 1914. చివరిది సరి అంకె. సరి బేసి నిబంధనల ప్రకారం ఢిల్లీలో ఇవ్వాళ బేసి నంబర్ ఉన్న వాహనాలకు మాత్రమే వినియోగించాలి.

అహ్మదాబాద్ (ఈస్ట్) స్థానం నుంచి లోక్ సభకు ఎంపికైన ఈ బీజేపీ ఎంపీ, సినీ నటుడు పరేష్ రావల్ గడిచిన రెండేళ్లుగా ఢిల్లీలోనూ ఉంటున్నారు. ఆయనకు సరి-బేసి విధాన నిబంధనపై అవగాహన కూడా వుంది. అయితే తానే అధికార పార్టీకి చెందిన ఎంపీని, తననెవరు అడుగుతారు, అడ్డుకుంటారని అనుకున్నారో ఏమో తెలియదు కానీ.. ఏకంగా నిబంధనలను బేఖాతరు చేసిమరీ పార్లమెంట్ లోకి తన కారులో వచ్చేశారు. ఈ విషయాన్ని గమనించిన మీడియా ఆయనను చుట్టుముట్టిన 'ఎందుకిలా రూల్స్ బ్రేక చేశారు?' అని అడితే సమాధానంపై దాటవేత ధోరణిని అవలంభించి వెళ్లారు.

చివ‌రికి ఏమ‌నుకున్నారో ఏమో కానీ పార్లమెంటు నుంచి బయటకు వచ్చి.. తాను తప్పు చేశానని అంగీకరించారు, స‌రిసంఖ్య వాహ‌నాన్ని ఉప‌యోగించినందుకు సీఎంకు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ‘తీవ్ర‌మైన త‌ప్పు చేశా.. ఢిల్లీ వాసులు, సీఎం కేజ్రీవాల్‌కు సారీ’ అంటూ ట్వీట్ చేశారు. ప‌రేశ్ రావ‌ల్‌తో పాటు ప‌లువురు బీజేపీ ఎంపీలు కూడా ఈ రోజు బేసి నెంబర్ల విధానాన్ని ఉల్లంఘించిన‌ట్లు తెలుస్తోంది. సరి-బేసి సంఖ్య విధానం నుంచి తమకు మినహాయింపు నివ్వాలంటూ ఎంపీలందరూ ఒక్కతాటిపైకి వచ్చి డిమాండు చేస్తున్నారు. ఈరోజు నుంచి పార్లమెంట్ రెండో దఫా బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఎంపీలు ఈ విధానంపై స్పందించారు.

టాక్సీల్లో సమావేశాలకు రావడం కుదరదని, ఈ నిబంధనల నుంచి తమకు మినహాయింపు నివ్వాలని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ కోరారు. మరో కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ మాట్లాడుతూ, ఈ విధానం కారణంగా ఎంపీలు పార్లమెంట్ కు రావాలంటే చాలా ఇబ్బందిగా ఉందన్నారు. సరి-బేసి విధానం కారణంగా సమావేశాలకు హాజరవ్వాలంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని సమాజ్ వాదీ పార్టీ ఎంపీ నరేశ్ అగర్వాల్ అన్నారు. కాగా, ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు గాను సరి-బేసి సంఖ్య విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రస్తుతం రెండో విడత సరి-బేసి విధానం ఈ నెల 15 నుంచి అమలు జరుగుతోంది.

ఈ విధానం నేప‌థ్యంలో స్పీకర్ అదేశానుసారం ఢిల్లీ ప్రభుత్వం, రవాణా శాఖ.. పార్ల‌మెంట్‌ సభ్యులు ఉభయ సభలకు చేరుకోవ‌డానికి స్పెష‌ల్ డీటీసీ బ‌స్ స‌ర్వీసుల‌ని ప్ర‌వేశ‌పెట్టింది. అయిన‌ప్ప‌టికీ వాటిని ఉప‌యోగించుకునే వారి సంఖ్య అత్యంత అరుదు. ఎంపీలకు క్వార్టర్ల వరకు దించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఆరు బస్సులను ఏర్పాటు చేయగా, వాటిలో ప్రయాణించేందుకు కూడా పార్లమెంటు సభ్యలు నామూషీ పడుతున్నారు. తాము ప్రజా సేవకులం అన్న విషయాన్ని మర్చిపోయిన ఎంపీ.. తాము బస్సులో రావడమేంటని అన్నట్లుగా ఖాళీ సీట్లు ప్రశ్నిస్తున్నాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : paresh rawal  parliament sessions  special DTC bus service  MPs  odd even system  Delhi  

Other Articles