Sushma Swaraj trolled on Twitter for wrapping herself up and covering head during Iran visit

Foreign minister sushma swaraj s iran look fires up twitter

External Affairs Minister Sushma Swaraj, Iran, Twitter, Iranian President, Hassan Rouhani, sushma swaraj irani women dressing, netizens critisies sushma swaraj, sushma swara trolles on social media

The photos of Sushma Swaraj, who was wearing a 'pink rida', wrapped herself up completely and cover in head, went viral on social media.

అమాత్యురాలి ఆహార్యం, వేషాధారణపై నెట్ జనుల మండిపాటు

Posted: 04/18/2016 06:29 PM IST
Foreign minister sushma swaraj s iran look fires up twitter

భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలకు విదేశీయులే ముగ్దులై వాటని ఆచరిస్తుండగా, భారత్ దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు, దేశం కాని దేశంలో అక్కడి దేశ ప్రతినిధులతో సమావేశమైన సందర్భంగా అమె ఇరానీ వనిత తరహాలో తయారవ్వడంపై విమర్శల జడివాన కురుస్తుంది, అమె ఇటీవల ఇరాన్ పర్యటన చేసిన సందర్భంగా అమె వేషాధరణపై నెట్ జనులు మండిపడుతున్నారు,

ఆ పర్యటనలో సుష్మా స్వరాజ్ వేసుకున్న డ్రస్ సహా అమె కనిపించిన వేషాధారణ మాత్రం వివాదాస్పదమైంది. సుష్మా టెహ్రాన్ లో ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె.. పింక్ కలర్ శారీ.. పింక్ శాల్వాతో ముస్లిం తరహాలో డ్రెస్స్ చేసుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడితో భేటీ అయినంత మాత్రాన అక్కడి వెళ్లిన సుష్మా స్వరాజ్ అక్కడ భారతీయ గోప్పదానాన్ని చాటేందుకు బదులు అక్కడి సంస్కృతీ సంప్రదాయాల మేరకు నడుచుకోవడంపై నెట్ జనులు విమర్శలు గుప్పిస్తున్నారు.

సుష్మా స్వరాజ్ తలను వస్త్రంతో కప్పుకొని ఉండటం హిందూ సంప్రదాయం కాదంటూ విమర్శిస్తున్నారు. అంతేకాదు.. సుష్మా స్వరాజ్ చీర ధరించి, హిందూ సంప్రదాయబద్ధంగా తలపై కప్పుకుని ఉంటే బాగుండేదని ఒకరంటే.. ఇరానీలు లేదా సౌదీ అరేబియా డిప్లమాట్స్ హిందూ సంప్రదాయం ప్రకారం నుదుటిపై కుంకుమ పెట్టుకుంటారా? అని మరొకరు, ముస్లిం మహిళల తరహాలో సుష్మా స్వరాజ్ డ్రెస్సు ధరించడం చాలా హాస్యాస్పదంగా ఉందని ఇంకొకరు... ఇలా పలు ట్వీట్లలో ఆమెపై విమర్శల వర్షం కురిపించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles