నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న ఓ నిత్య పెళ్లికోడుకు మళ్లీ పరారయ్యాడు. అదేంటి నాలుగు పెళ్లిళ్తు చేసుకునేందుకు ఏ మతంలోనూ అనుమతి లేదుగా మరి అలా ఎలా పెళ్లిళ్ళు చేసుకున్నాడనేగా మీ డౌట్, చట్ట ప్రకారం పెళ్లిళ్లు చేసుకుని, వారితో కాపురం చేస్తే సమస్య కానీ, పెళ్లిళ్లు చేసుకోవడం, వధువు తరపున వచ్చిన కట్నం, బంగారు ఆభరణాలు ఇత్యాది కట్న కానులను తీసుకుని పరారై.. మరో పెళ్లి చేసుకుని అదే తంతును నిర్వహించే ప్రబుద్ధులకు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా.. దోరికే వరకే.. ఎందుకంటే ఆ తరువాత వాళ్ల సంసారం జైళ్లోనే కదా..
అయ్య బాబోయ్ ఇలాంటి వాల్లు కూడా వుంటారా..? అంటే మీ అంత అమాయకులు లేరన్నట్టే. తాజాగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న ఓ ఘనుడు మూడు నెలలు తిరగకుండానే నాల్గవ భార్యను వదిలి పరారయ్యాడు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.... టోలిచౌకి, పారామౌంట్ కాలనీలో నివసించే సిమ్రాన్ సయీద్(19) అనే యువతి వివాహం గతేడాది నవంబర్ 13న సయ్యద్ యాసర్ అహ్మద్‌తో జరిగింది. పెళ్లి సమయంలో రూ. 30 లక్షల నగదు, 20 తులాల బంగారు నగలు కట్నంగా ఇచ్చారు.
అయితే పెళ్లి జరిగిన కొద్ది రోజుల నుంచే సిమ్రాన్ ను అమె అత్తగారు వేధించడం మొదలుపెట్టింది. వేధింపులు మరింతగా పెరగడంతో గత్యంతరం లేని సిమ్రాన్ భర్తతో కలసి వేరు కాపురం పెట్టింది. అయినాసరే అత్త వేధింపులు ఆపకపోవడంతో వేరుకాపురం మానేసి సొంతింటికి తీసుకొచ్చింది. తన భర్త ఆభరణాల వ్యాపారి అని పెళ్లికి ముందు నమ్మించారని, తీరా చూస్తే ఏమి చేయకుండా ఇంట్లోనే ఉంటుండటంతో పలుమార్లు గొడవలు జరిగాయి.
ఈ నేపథ్యంలోనే సిమ్రాన్‌ను ఆమె అత్త గదిలో వేసి తాళం వేసి తీవ్రం గా కొట్టేది. ఈ ఏడాది జనవరి 19న ఆమెకు వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. తన కుటుంబ సభ్యులను పిలిపించి చెప్పినా ఉపయోగం లేకపోవడంతో సిమ్రాన్ తన పుట్టింటికి వెళ్లిపోయింది. మూడు రోజుల క్రితం భర్తతో పాటు అత్త, ఆమె కుటుంబ సభ్యులు పరారయ్యారు. దీంతో ఆరా తీసని సిమ్రాన్ కుటుంబ సభ్యులకు మోసపోయామని తెలిసి.. కన్నీళ్ల పర్యంతమయ్యారు. గత్యంతరం లేని పరిస్థితులలో పోలీసులను ఆశ్రయించారు. తనను నాల్గవ వివాహం చేసుకొని మూడు నెలలు తిరగకుండానే మోసం చేసి పరారైన భర్త, అత్తపై చర్యలు తీసుకోవాలని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more