Tension in Hyderabad Central University

Tension in hyderabad central university

HCU, Hyderabad Central University, Hyderabad, VC, Appa Rao, Rohith Vemula

Students union leaders protesting at Hyderabad Central University Administration building. They are demanding to remove VC Apparao.

హెచ్.సి.యులో మరోసారి ఉద్రిక్తత

Posted: 04/06/2016 11:47 AM IST
Tension in hyderabad central university

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. పి.హెచ్.డి విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యతో ప్రారంభమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంతకంతకు ఆందోళనలతో ఉడికిపోతోంది. కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయల కారణంగా రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నాడని గతకొంత కాలంగా యూనివర్సిటీ క్యాంపస్ లో నిరసనలు వెల్లువెత్తాయి. అయితే తాజాగా మరోసారి హెచ్.సి.యు అగ్నిగుండంగా మారింది.

విద్యార్థులు ఇచ్చిన ‘ఛలో హెచ్‌సీయూ’ పిలుపుతో యూనివర్శిటీ దగ్గర మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. అప్రమత్తమైన పోలీసు అధికారులు వర్శిటీ దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.HCU విద్యార్థులు, సిబ్బందికి మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు.  యూనివర్శిటీ మెయిన్‌ గేట్‌ దగ్గర సెక్యూరిటీతో పాటు భారీగా పోలీసులు మొహరించారు. మరో వైపు ఛలో HCU కు పలు విద్యార్థి సంఘాలు మద్దతు ఇచ్చాయి. వీసీ అప్పారావును విదులనుంచి తొలగించాలంటూ విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

-Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : HCU  Hyderabad Central University  Hyderabad  VC  Appa Rao  Rohith Vemula  

Other Articles