What Happended in Navdeeps form house

What happended in navdeeps form house

Navdep, Navdeep Farm House, Police, rangareddy

Police ride on Telugu hero Navdeep farm house in Rangareddy dist. After the attack hero navdeep escape from there. He replied on this issue via twitter

నవదీప్ ఫాంహౌజ్ లో ఏం జరిగింది..?

Posted: 03/26/2016 01:29 PM IST
What happended in navdeeps form house

తరచూ వివాదాల్లో చిక్కుకునే హీరో నవదీప్ మళ్లీ వార్తలకెక్కారు. రంగారెడ్డి జిల్లా మోమెన్ పేటలోని ఆయన ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. తెల్లవారు ఝామున ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. నవదీప్ సహా పలువురు పరారీలో ఉన్నట్లు సమాచారం. పెద్దమొత్తంలో విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకున్నారు. డీజేను సీజ్ చేశారు.



తన ఫాంహౌస్‌పై పోలీసుల దాడి చేశారంటూ మీడియాలో వచ్చిన కథనాలపై స్పందించారు హీరో నవదీప్. అసలు ఆ రేవ్ పార్టీ గోలేంటో నాకేమీ తెలియదన్నారు. తనకి ఫాంహౌసే లేదంటూ వాపోయారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ట్విట్ చేశారు. మీరు నా పేరు వాడిన ప్రతిసారీ ఒక్కో రూపాయి ఇచ్చినా నేను ఫాంహౌస్‌ కొనగలిగేవాడినేమో. ఎలాగూ వీడి మీద చాలా ఉన్నాయి.. కదా మరొకటి వేసేద్దామని అనుకుంటున్నారంటూ మీడియాపై కారాలు..మిరియాలు నూరారు. ఫ్యామిలీతో డిన్నర్‌కి వెళ్తే..రేవ్ పార్టీలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాడు చెప్పాడని..వీడు రాశాడని..ఇంకొకడు రాశాడంట..దేశానికి నేను ఎలాగూ పనికిరానని మీ ఫిలింగ్ కదా..నన్ను పక్కన బెట్టి పనికొచ్చే పనిచేయండి. ఓ గృహప్రవేశాన్ని రేవ్ పార్టీ చేసిన మహానుభావులక పాదాభివందనాలు అంటూ ట్వీట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Navdep  Navdeep Farm House  Police  rangareddy  

Other Articles