Ride on Donkey and get baby boys in Gujarat

Ride on donkey and get baby boys in gujarat

Gujarat, Donkey, Junagadh, raang, Borvav

In India being paraded on a donkey with a blackened face and a garland of shoes is a time-honoured way to shame someone. But it’s not so in the small village Borvav near Junagadh, saurashtra. The tradition is called `raang’ and it’s continuing since many years in Borvav. The purpose was originally to collect the funds to feed birds, but later, it also became associated with the arrival of a male heir, usually desperately demanded in this village.

గాడిద ఎక్కు మగపిల్లలను కను

Posted: 03/25/2016 04:04 PM IST
Ride on donkey and get baby boys in gujarat

పుట్టే బిడ్డలు ఆడైనా, మగైనా ఒక్కటే అనుకునే వాళ్లు ఎంత మంది ఉన్నా కానీ.. మగ బిడ్డలు మాత్రమే కావాలి అనుకునే వాళ్లు ఎంతో మంది ఉన్నారు. మగబిడ్డలు పుట్టాలని రకరకాల పూజలు చేస్తుంటారు.. గుడులు.,గోపురాలు తిరుగుతుంటారు. మగబిడ్డ పుడతారు అంటే చెట్ల మందుల పేరుతో నాటు వైద్యానికి కూడా సిద్దంగా ఉంటారు. ఇదంతా అందరికి తెలుసు.. చాలా చోట్ల జరిగేదే. కానీ గుజరాత్ రాష్ట్రం  జూనగాఢ్ జిల్లాలోని బోర్వావ్ లో మాత్రం మగ సంతానం కోసం గాడిదలపై మగాళ్లు ఊరేగుతున్నారు. ఇది ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ గత కొంత కాలంగా అనవాయితీగా వస్తుంది. హోలీ రోజున గాడిదపై ఊరేగితే మగ పిల్లలు పుడుతారని ఆ గ్రామ ప్రజల్లో బలమైన నమ్మకం ఉంది.

బలం లేకపోతే బల్లి పామై కాటేస్తుంది అంటే ఇదే మరి. ఆ ఊర్లో ఉన్న రెండు గాడిదలకు మంచి గిరాకీ ఉందట. దానిపై ఊరేగేందుకు ప్రజలు ఏకంగా వెయిటింగ్ లిస్టులో ఉన్నారట. మగ సంతానం లేని వారు హోలీ పండగ రోజు గాడిద మీద ఊరేగుతూ భిక్షాటన చేస్తారు. మొదట స్థానికంగా ఉండే పక్షులు, జంతువుల ఆహారం కోసం ఈ పద్ధతిని మొదలుపెట్టారు. రాను రాను అలా ఎక్కిన వారందరికీ మగపిల్లలు పుట్టడంతో గ్రామస్థులకు నమ్మకం పెరిగింది. వచ్చే ఏడాది ఎవరూ గాడిదపై ఊరేగాలో ఇప్పుడే బుక్ చేసుకున్నారు. గాడిదపై ఊరేగేందుకు పది కుటుంబాలు పోటీ పడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gujarat  Donkey  Junagadh  raang  Borvav  

Other Articles