తమిళనాడుతో తమ పార్టీకి స్టార్ స్టేటస్ తీసుకురావాలని యత్నించిన బీజేపి శ్రేణులు సూపర్ స్టార్ రజనీ కాంత్ ను తమ పార్టీలోకి చేర్పించుకునేందుకు స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ రంగంలోకి దిగినా.. తనకు రాజకీయాలు వద్దని సున్నితంగా తిరస్కరించిన తరువాత బీజేపి పార్టీ మరో తార కోసం అన్వేషణ ప్రారంభించింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో క్రేజీస్టార్‌గా వెలుగొందుతున్న విశాల్‌ను పార్టీలోకి తీసుకురావాలని బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. చెన్నై వాసుడైన క్రికెటర్ శ్రీకాంత్ విశాల్ కోసం గట్టిగా సిఫార్సు చేస్తున్నారు.
బీజేపి పార్టీ అగ్రనేత మురళీధరరావుతో శ్రీకాంత్ సంప్రదింపులు జరిపారు. మైలాపూరు నియోజకవర్గం నుంచి విశాల్‌ను పోటీకి పెట్టాలని శ్రీకాంత్ ఆశిస్తున్నారు. బీజేపీ నుంచి పోటీకి సీనియర్ నటీనటులు విసు, నటి వైజయంతీమాల తదితరుల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే విశాల్‌ను సైతం ఎన్నికల బరిలో దించాలని బీజేపీ సైతం భావిస్తోంది. నడిగర్ సంఘం భవన నిర్మాణంలో తలమునకలై ఉన్నందున మరో ఆరునెలలు విరామం లేదని విశాల్ సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. అయితే బీజేపీ మాత్రం విశాల్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తోంది.
జార్జికోటపై జెండా పాతేందుకు భారతీయ జనతా పార్టీ అధిష్టానమే కదలివస్తోంది. ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా త్వరలో తమిళనాడుకు వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన బీజేపీ కూటమి కోసం రాష్ట్ర నేతలు అన్నిరకాల ప్రయత్నాలు చేశారు. తాజా పార్లమెంటు ఎన్నికల్లో తమతో కలిసి నడిచారన్న నమ్మకంతో డీఎండీకే, పీఎంకే తదితర పార్టీలను అనేకసార్లు ఆహ్వానించారు. అలాగే మరోవైపు అన్నాడీఎంకే నుంచి అమ్మ పిలుపు కోసం ఆశగా ఎదురుచూశారు. ఆఖరుకు కేంద్రమంత్రి, రాష్ట్ర పార్టీ ఎన్నికల వ్యవహారాల ఇన్చార్జ్ ప్రకాష్ జవదేకర్ సైతం రంగంలోకి దిగారు.
అయితే ఈ ప్రయత్నాలేవీ ఫలించలేదు. పొత్తు చర్చలతో నిమిత్తం లేకుండా బీజేపీ అభ్యర్థుల ఎంపిక సాగుతోంది. ప్రతి ఒక్క నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థులను నిలపాలని అధిష్టానం ఆదేశించింది. ఎవ్వరూ ఊహించని రీతిలో 234 నియోజకవర్గాలకు మూడువేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఒంటరిపోరా లేక మరేదైనా పార్టీలు ముందుకు వస్తాయా అని బీజేపీ సందిగ్ధంలో ఉంది. పార్టీలోని ఎక్కువ శాతం మంది ఒంటరి పోరుకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఒంటరిగా పోటీ చేయడం ద్వారా బీజేపీ బలమేంటో తేటతెల్లం కాగలదని పార్టీశ్రేణులు అభిప్రాయపడుతున్నారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more