Suresh Prabhu produce the Railway Budget in the Parliament

Suresh prabhu produce the railway budget in the parliament

Railway, Budget, Railway Budget

Railway Minister Suresh Prabhu giving budget speech in the parliament.

రైల్వే బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన సురేష్ ప్రభు

Posted: 02/25/2016 12:55 PM IST
Suresh prabhu produce the railway budget in the parliament

కేంద్ర మంత్రి సురేష్ ప్రభు పార్లమెంట్ లో రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. పరిశుభ్రత, రైల్వే భద్రతకు పెద్దపీట వేస్తామని ఆయన తెలిపారు.  రైల్వేల అభివృద్ధితోనే దేశాభివృద్ధి అని సురేశ్ ప్రభు పేర్కొన్నారు. రూపాయి పెట్టుబడితో ఐదు రూపాయల వృద్ది సాధించేలా కార్యచరణ సిద్దం చేస్తామని రైల్వే మంత్రి ప్రకటించారు.  2016-17 నాటికి 9వేల ఉద్యోగాలకు కల్పిస్తామని ప్రకటించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రైల్వే  పనితీరును మెరుగు పరుస్తున్నాని కూడా సురేష్ ప్రభు ప్రకటిచారు.

రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు....
*100 స్టేషన్లలో వైఫై సేవలు, రెండేళ్లలో మరో 400 స్టేషన్లకు విస్తరణ
*ఐవీఆర్ఎస్ సిస్టంతో ప్రయాణికుల నుంచి రోజుకు లక్షకు పైగా కాల్స్ వస్తున్నాయి
*మహిళలు, ఇతరుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కూడా ఇది ఉపయోగపడుతోంది.
* 40వేల కోట్లతో రెండు లోకో మోటివ్ పరిశ్రమల ఏర్పాటు
* టైమ్ టేబుల్ ద్వారా రైళ్లను నడిపేందుకు ప్రాధాన్యత
* రూపాయి పెట్టుబడితో 5 రూపాయిల వృద్ధి సాధించిలా కార్యాచరణ
* రాజధాని, శతాబ్ధి రైళ్ల ఫ్రీకెన్సీ పెంపు
* ఈ ఏడాది మూడు సరుకు రవాణా కారిడార్ల నిర్మాణం
* 2016-17 నాటికి 9వేల ఉద్యోగాలకు కల్పన
* అన్ని రైల్వే స్టేషన్లలో డిస్పోజల్ బెడ్ రోల్స్
*ఈ ఏడాది 5,300 కిలోమీటర్ల మేర కొత్తగా 44 కొత్త ప్రాజెక్టులు
*ఇప్పుడు రైల్వే మంత్రికి, సామాన్య ప్రయాణికుడికి ఏమాత్రం తేడా లేదు
* వచ్చే ఏడాది 2,800 కి.మీ. మేర కొత్త లైన్ల నిర్మాణం
*ఖరగ్ పూర్-ముంబై, ఖరగ్ పూర్-విజయవాడ మధ్య ట్రిప్లింగ్
* రైల్వేల్లో ఐటీ వినియోగానికి ప్రాధాన్యం
* ప్రతి రూపాయి సద్వినియోగం చేస్తాం
*జమ్ము-కశ్మీర్ టన్నెల్ వర్క్స్ వేగవంతం
*దేశంలోని మిగతా ప్రాంతాలకు కనెక్టవిటీ
* ఈశాన్య రైల్వే పనులు మరింత వేగవంతం
* పెండింగ్ ప్రాజెక్టులు మూడేళ్లలో పూర్తి
* ప్రతి పౌరుడు గర్వపడేలా రైల్వే ప్రయాణాన్ని తీర్చిదిద్దుతాం
*రైల్వే టెండరింగ్ విధానంలో పేపర్ లెస్ పద్ధతి
*రైల్వేలు, పోర్టుల మధ్య కనెక్టివిటీ పెంపు
* పీపీపీ విధానం ద్వారా కొత్త ప్రాజెక్టులు
* ఈ ఏడాది రైల్వే ప్రణాళికా వ్యయం 1.21 కోట్లు

(Source: Sakshi)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Railway  Budget  Railway Budget  

Other Articles