security guards quarell to attain currency notes bag in dump yard

Currency notes in jawaharnagar dumping yard

security guards, jawaharnagar dump yard, security guards fight, dump yard currency notes bag, hyderabad dump yard, currency notes jawaharnagar, police, dump yard staff, jawahar nagar, dump yard, hyderabad, dumpyard staff, dumpyard security

security guards in hyderab ad jawahar nagar dump yard fight for currency notes bag

డంపింగ్ యార్డులో కరెన్సీనోట్ల కలకలం.. కొట్టుకున్న సెక్యూరిటీ సిబ్బంది.

Posted: 02/23/2016 04:54 PM IST
Currency notes in jawaharnagar dumping yard

అదృష్టం తలుపు తడితే.. వద్దనుకునే వారు ఎవరైనా వుంటారా..? అయినా పది మందిలో పాము చావదన్న సామెత కూడా తెలియని వాళ్లు అదృష్టమంతా తమకంటే తమకే దక్కలాని పోటీ పడ్డారు. అంతటితో ఆగకుండా ఒకరితో మరోకరు తలపడ్డారు. ఇది జరిగింది ఎక్కడో పరాయి దేశంలోనో లేక రాష్ట్రంలోనో కాదు.. అచ్చం జూలాయి సినిమా తరహాలో హైదరాబాదులోని జవహర్ నగర్ డంపింగ్ యార్డులో ఈ ఘటన జరిగింది. జవహర్ నగర్ సమీపంలోని డంపింగ్ యార్డులో పడ్డ ఓ పెద్ద బ్యాగులో భారీ మొత్తంలో కరెన్సీ కట్టలు ఉన్నాయని వార్తు బయటపడటంతో అక్కడి సెక్యూరిటీ గార్డులు తమకే మొత్తం డబ్బు దక్కలంటూ కొట్టుకున్నారు.

ఇక సెక్యూరిటీ గార్డులే కొట్టుకుంటూ ఉంటే, తమకు ఎక్కడ చిక్కుతాయనుకున్నారో? ఏమో... యార్డు సిబ్బంది సమాచారాన్ని పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు రంగంలోకి దిగారు. అసలు ఆ బ్యాగులో ఉన్న కరెన్సీ నోట్లు అసలువా? లేక నకిలీవా? అన్న విషయాన్ని కూడా వదిలేసి మరీ సెక్యూరిటీ గార్డులు ఘర్షణ పడ్డ వైనంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కరెన్సీ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎలా వచ్చాయి.. అవి అసలువా..? లేక నకిలీవా అన్న విషయాన్ని పోలీసులు విచారణ చేస్తున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : jawahar nagar  dump yard  hyderabad  dumpyard staff  dumpyard security  

Other Articles