Ringing Bells gets 5 crore registrations

Ringing bells gets 5 crore registrations

Freedom251, ringingbells, 251 Smart phone, Indian, cheapest Mobile in the world

While the world kept asking questions and Indians remained puzzled, the Noida-based startup, promising a Rs.251 (less than $4) “Make in India” smartphone, on Friday claimed to have received nearly five crore registrations in just two days of opening up for online pre-orders.

ఐదు కోట్లు దాటిన ఫ్రీడం 251 రిజిస్ట్రేషన్లు..!

Posted: 02/20/2016 12:50 PM IST
Ringing bells gets 5 crore registrations

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు కోట్ల మంది ఆ ఫోన్ ను ఆర్డర్ చేస్తున్నారని దేశంలో ఓ సంచలన వార్త హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఆ ఫోన్ ఏది అని మీరు కనిపెట్టే ఉంటారు. ఫ్రీడం 251 పేరుతో కేవలం 251 రూపాయలకే స్మార్ట్ ఫోన్ ను అందిస్తామని రింగింగ్ బెల్స్ సంచలన ప్రకటన చేసింది. అయితే మొదటి రోజు సర్వర్ డౌన్ కావడంతో రిజస్ట్రేషన్ కోసం వెబ్ సైట్ పనిచెయ్యలేదు. కేవలం రెండు రోజుల్లో ఈ స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరగడం ఇదే మొదటిసారి. ఒక్కో యూజర్ కేవలం ఒక ఫోన్‌ను మాత్రమే ఆర్డర్ ఇచ్చేలా కండీషన్ పెట్టినా ఈ స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరగడం విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది.

ప్రపంచంలోనే అతి తక్కువ ఖరీదైన ఈ స్మార్ట్‌ఫోన్‌ను యువకులు ఎక్కువగా ఆసక్తి కనపరుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో కంపెనీ 25 లక్షల ఫోన్ల వరకే అందిస్తామని చెప్పినా..  ప్రస్తుతం వస్తున్న రెస్పాన్స్‌ను చూసి ఈ ఆన్‌లైన్ ఆర్డర్ ప్రక్రియను నిలిపి వేయాలా.. లేక ఫిబ్రవరి 21 రాత్రి 8 గంటల వరకూ ఉంచాలా అనేది పరిశీలిస్తున్నామని రింగింగ్ బెల్స్ ప్రెసిడెంట్ అశోక్ చంద్ర తెలిపారు. ఏప్రిల్ 10న ఫోన్ డెలివరీ ప్రక్రియను ప్రారంభించి జూన్ 30 లోపు పూర్తి చేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ ప్రక్రియ ఆధారంగా ఫోన్లను అందిస్తామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Freedom251  ringingbells  251 Smart phone  Indian  cheapest Mobile in the world  

Other Articles