Muslim girl tops Ramayana exam with 93% marks

Muslim girl tops ramayana exam with 93 marks

Ramayana Exam, Muslim Girl, Karnataka, Fathimath Rohila, Mahabharata exam

When a raging debate over intolerance is going on in the country, a 13-year-old Muslim girl from Karnataka, has scored 93 percent and topped the Ramayana exam. Fathimath Rohila, who hails from Karnataka, topped the exam conducted by Bharatha Sanskriti Prathisthan in November 2015.

రామాయణం మీద పరీక్ష.. ముస్లిం అమ్మాయే టాప్

Posted: 02/15/2016 12:53 PM IST
Muslim girl tops ramayana exam with 93 marks

భారతదేశం అంటేనే సర్వమతాల సమ్మేళనం. మతాలు వేరయినా కానీ మనుషులు మాత్రం ఒక్కటే. అయితే గత కొంత కాలంగా మన దేశంలో అసహనం కుదిపేస్తోంది. కానీ ఓ పద్నాలుగేళ్ల అమ్మాయి మాత్రం మత సహనం అంటే ఏమిటో చెబుతోంది. తనకు తెలిసిందల్లా కేవలం చదువుకోవమే అయినా దానితోనే అందరికి కనువిప్పు కలిగిస్తోంది. ఆమె ఓ ముస్లిం అమ్మాయి అయినా కానీ ఆమెను కేవలం  ఖురాన్ మాత్రమే చదవాలని ఆమెకి ఎవరూ చెప్పలేదు... అందుకే రామాయాణం కూడా చదివింది. అంతేకాదు మహాభారతం కూడా త్వరలో ఔపోసన పట్టేస్తానని అంటోంది. ఇప్పుడు ఆ అమ్మాయిని మత సహనానికి నిదర్శనంగా చెప్పుకుంటున్నారు  ఎందుకు అనుకుంటున్నారా..? ఆ అమ్మాయి రామాయణాన్ని అవపోసన పట్టింది.

కర్ణాటకలో రాష్ట్రస్థాయి రామాయణంపై పెట్టిన పరీక్షలో ఆమె మొదటి స్థానంలో నిలిచింది. ఆ పరీక్షలో 93 శాతం మార్కులు తెచ్చుకుంది. దీనిని భారత సంస్కృతి ప్రతిష్ఠాన్ సంస్థ గత ఏడాది నవంబర్లో నిర్వహించింది. వాటి ఫలితాలు ఇప్పుడు వచ్చాయి. కర్ణాటక - కేరళ సరిహద్దులో ఉండే సుల్లియపడవు గ్రామంలో సర్వోదయ హైస్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతోంది రహీలా. ఆ స్కూలు నుంచి 39 మంది ఈ రామయణం రాత పరీక్షలో పాల్గొన్నారు. ఆమె తన అంకుల్ సాయంతో రామాయణం చదువుకున్నానని తెలిపింది. ఆమె తండ్రి ఓ ఫ్యాక్టరీలో పనివాడు. త్వరలో మహాభారతంపై కూడా రాత పరీక్ష జరుగబోతోంది. ఆ పరీక్షలో టాపర్ గా నిలవాలని రహీలా కోరుకుంటోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Karnataka  Fathimath Rohila  Ramayana exam  

Other Articles