Iphone 6S price drops

Iphone 6s price drops

Iphone, Apple Iphone 6S, Iphone price drops

Apple's products are very resistant to the market forces and remain resistant to price drops. That's not happened with the iPhone 6S. Its price has dropped by more than 27 per cent and it's available for less than Rs.45,000 on some e-commerce sites. Particularly, the 16GB iPhone 6S in the new rose gold colour is available for just Rs.44,799 on Amazon India which marks a price drop of more than 27 per cent. The 16GB model of the iPhone 6S launched last October in India for Rs.62,000.

ఐఫోన్ 6ఎస్ రేటు తగ్గింది... బాగా తగ్గింది

Posted: 02/13/2016 10:08 AM IST
Iphone 6s price drops

పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లు ఫోన్లలో ఐఫోన్లు వేరు. ఎందుకంటే ఐఫోన్లకు ఉన్నంత క్రేజ్ వేటికీ లేదు. అయితే ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న యాపిల్ ఐఫోన్లు భారత మార్కెట్లో మాత్రం తక్కువ ధరకే వస్తున్నాయి. అవును బయటి కంటే కూడా భారత మార్కెట్ లోనే ఐఫోన్ రేట్ తక్కువగా అందుబాటులోకి వస్తోంది. ముఖ్యంగా ఐఫోన్ కొత్తగా లాంఛ్ చేసిన ఐఫోన్ 6 ఎస్ రేట్ బయటి మార్కెట్ కంటే కూడా ఈ కామర్స్ సైట్లు తక్కువ రేటుకు అందుబాటులో ఉంచాయి. దాదాపుగా 20 శాతం తక్కువకు ఐఫోన్ 6ఎస్ అందుబాటులోకి రావడం జరిగింది. కాగా ఒక్కో ఈ కామర్స్ సైట్ ఒక్కో రేట్ కు అమ్ముతున్నా కానీ మొత్తానికి బారీగా రేట్ తగ్గింది అని మాత్రం చెప్పవచ్చు.

యాపిల్ కంపెనీ 64 జీబీ ఐఫోన్‌-6ఎస్‌ను లాంచ్‌ చేసిన సమయంలో దీని ధర అక్షరాల  62వేలు. ఇప్పుడు గోల్డ్ కలర్ ఐఫోన్‌ 6ఎస్‌ మోడల్ కేవలం  44,799లకే అమెజాన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. అంటే ఈ మోడల్‌ ధర 27శాతం తగ్గింది. ఇక 64 జీబీ గ్రే కలర్ మోడల్ ధర మొదట్లో  72వేలు ఉండగా.. ఇప్పుడు అది 57,699కే లభిస్తోంది. పేటీఎంలోనూ ఐఫోన్‌ 6ఎస్‌ తక్కువ ధరకు లభిస్తున్నది. 6ఎస్‌ 128 జీబీ మోడల్ వాస్తవ ధర 82వేలు కాగా.. 20శాతం డిస్కౌంట్‌ తో 65,490లకే ఈ ఫోన్‌ లభిస్తున్నది. పేటీఎంలో ఐఫోన్‌ 6ఎస్‌ 64 జీబీ బేస్ మోడల్‌ రూ. 66,489కి లభిస్తుండగా, ఫ్లిప్‌కార్ట్‌లో ఇదే మోడల్‌ 49,999కి లభిస్తున్నది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Iphone  Apple Iphone 6S  Iphone price drops  

Other Articles