Virat Kohli | Anushka Sharma | breakup | Love | Stills

Virat kohli breakup with anushka sharma

Virat Kohli breakup with Anushka Sharma, Virat Kohli love breakup, Virat Kohli responds on love breakup, Kohli love breakup, Anushka Sharma love gone, Anushka Sharma love story, Anushka Sharma breakup

Virat Kohli breakup with Anushka Sharma: Bollywood actress Anushka Sharma and Indian cricketer Virat Kohli love breakup.

అనుష్కతో బ్రేకప్.. సోలో అంటున్న కోహ్లి

Posted: 02/10/2016 10:03 AM IST
Virat kohli breakup with anushka sharma

బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ, ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీల ప్రేమ బ్రేకప్ అయ్యిందని గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే. మొన్నటివరకు ఎక్కడికెళ్లినా కూడా జంటగా కనిపించిన వీరు.. ఈ మధ్య జంటగా కనిపించడం లేదు. పైగా ఒకరినొకరు చూసుకోవడానికి, మాట్లాడుకోవడానికి ఇష్టపడటంలేదు. దీంతో వీరిద్దరూ బ్రేకప్ చేసుకున్నట్లుగా బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా వుంటే తాజాగా కోహ్లి తాను ప్రస్తుతం సోలో అంటూ సంబరపడిపోతున్నాడంటూ ప్రముఖ పత్రిక ముంబై మిర్రర్ పేర్కొంది. ఇటీవలే ఓ వేడుకలో పాల్గొన్న విరాట్ కోహ్లి తన సన్నిహితులతో ఉత్సాహంగా కనిపించాడట. ఇదే సమయంలో తన అత్యంత సన్నిహితులతో ‘ఇప్పుడు నేను ఒంటరిని.. ఛలో డాన్స్ చేద్దాం రండి’ అంటూ పిలిచాడట కోహ్లి.

కోహ్లి మాటలకు అక్కడివారంతా అనుష్కతో బ్రేకప్ వార్తలు నిజమేనని నిర్దారించుకున్నారట. అనుష్క ఎప్పుడు కంట్రోలింగ్ గర్ల్ ఫ్రెండ్ అని, ఎప్పుడూ ఆమె జపం చేయాల్సి వచ్చేదని తన స్నేహితులతో చెప్పుకొని కోహ్లి వాపోయడట. మొత్తానికి వీరిద్దరూ విడిపోయారని అర్థమవుతోంది.

ఇదిలా వుంటే ఈ ప్రేమికుల రోజును అనుష్కతో సరదాగా గడిపేందుకు కోహ్లి శ్రీలంక టీట్వంటీ సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకుంటే, అనుష్క మాత్రం సల్మాన్ తో ‘సుల్తాన్’ షూటింగ్ లో తీరిక లేకుండా గడుపుతోందని ముంబై మిర్రర్ కథనం ప్రచురించింది. దీంతో వీరిద్దరి బ్రేకప్ వార్తలు వాస్తవమేనని అందరూ భావిస్తున్నారు. మరి ఈ వార్తలపై అనుష్క ఎలా స్పందిస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anushka Sharma  Virat Kohli  Love  Breakup  Stills  

Other Articles