CPI Narayana spoke about his 'Ear Slashing' challenge sportingly

Cpi narayana spoke about his ear slashing challenge sportingly

CPI Narayana, GHMC Election Results, CM Kcr, Hyderabad TDP, Congress, BJP, TRS, KCR, MIM Party, GHMC polls

CPI Narayana spoke about his 'Ear Slashing' challenge sportingly. CPI Narayana said that take Ear slashing challenge as sportive

ITEMVIDEOS: చెవి కోసుకోవడం స్పోర్టివ్ గా తీసుకోవాలట..!

Posted: 02/05/2016 07:31 PM IST
Cpi narayana spoke about his ear slashing challenge sportingly

గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు వంద స్థానాలు గెలిస్తే చెవి కోసుకుంటా అని సవాల్ చేసిన  నారాయణ ప్లేట్ ఫిరాయించారు.  చెవి కోసుకుంటామనగానే కోసేసుకుంటామా ఏంటి అని ప్రశ్నించారు. చెవి సవాల్‌ను స్పోర్టివ్‌గా తీసుకోవాలన్నారు. జనంలోకి వెళ్లినప్పుడు  ఆమాత్రం ఊపున్న మాటలు రావడం సహజమన్నారు నారాయణ.

చాలా మంది నేతలు మెడకాయ నరుక్కుంటామని చెప్పారు… వారంతా నిజంగా నరికేసుకున్నారా! అని ప్రశ్నించారు. మాట వరుసకు చంపేస్తాం అంటామ్… ఆ మాత్రాన నిజంగానే చంపేస్తామా అని ఎదురు ప్రశ్నించారు. అధికార పార్టీ నోట్లను ఖర్చు పెట్టిందని… తాము నోటిని మాత్రమే ఖర్చు పెట్టగలిగామన్నారు. ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ను అభినందిస్తున్నానని చెప్పారు.  టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా సిటీలో నీరు, కరెంట్ వంటి సమస్యలను పరిష్కరించిందని జనం దాన్ని చూసి కూడా ఓటేశారని నారాయణ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయం కూడా మంచిది కాదన్న భావన ప్రజల్లో వ్యక్తమైందని నారాయణ విశ్లేషించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CPI Narayana  GHMC Election Results  CM Kcr  Hyderabad TDP  Congress  BJP  TRS  KCR  MIM Party  GHMC polls  

Other Articles