Is KCR eat center fresh

Is kcr eat center fresh

KCR, GHMC, Polling, GHMC Polling, MIM, AIMIM, Asaduddin Owisi, Akbaruddin Owisi, Shabbir Ali, Uttam Kumar, KCR on MIM, Elections, Violence in GHMC Elections

Why dont he talk about the MIM attack on other party leaders. MIM leaders attacke on TDP, BJP, Congress and TRS leaders on polling time

కేసీఆర్ సెంటర్ ఫ్రెష్ తిన్నాడా..? మజ్లిస్ గురించి మాటరాలేదు..?

Posted: 02/05/2016 01:55 PM IST
Is kcr eat center fresh

తెలంగాణ సిఎం ఈ మధ్యన ఓసారి తీరిక దొరికి టీవీ చూస్తూ కూర్చున్నాడట. అలా టీవీ చూస్తుంటే... అప్పుడే సెంటర్ ఫ్రెష్ యాడ్ వచ్చిందట. సెంటర్ ఫ్రెష్ యాడ్ చూసిన కేసీఆర్.. నిజంగా సెంటర్ ఫ్రెష్ నోటికి తాళం వేస్తుందా అనే అనుమానం వచ్చిందట. అంతే దీని సంగతేందో తేలుద్దాం అని... తన మనువడికి చెప్పి ఓ సెంటర్ ఫ్రెష్ తెప్పించాడట. అయితే ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో ఎలాగూ.. మనం గెలుస్తాం... అన్ని సర్వేలు కూడా మనకే అనుకూలంగా ఉన్నాయి.. సో ఇప్పుడు గెలిచిన ఆనందంలో ఎక్కువగా మాట్లాడేస్తాను.. సో.. ఒక్కసారి సెంటర్ ఫ్రెష్ ను ట్రై చేద్దాం అనుకొని.. నోట్లో వేసుకున్నాడట. తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి.

సెంటర్ ఫ్రెష్ తిన్న తర్వాత నుండి అసలు ఆట షురూ అయింది. సెంటర్ ఫ్రెష్ అలా నోట్లో వేసుకున్న కేసీఆర్ కు దాని రుచి నోటికి తగలకుండానే ఓ ఫోన్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసిన కేసీఆర్ పోలింగ్ లో భాగంగా ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు కనిపించిన అన్ని పార్టీల కార్యకర్తల మీద దాడి చేశారు.. చివరకు మన డిప్యూటీ సిఎం ఇంటి మీద దాడి చెయ్యడమే కాకుండా మహమూద్ అలీ కొడుకును కొట్టారు అని ఫోన్ సారాంశం. అది విన్న కేసీఆర్... వెంటనే వాళ్ల మీద చర్యలు తీసుకోండి.. దాడి చేసిన వాళ్లను అరెస్టు చెయ్యండి.. పాతబస్తీలో ప్రజలకు రక్షణ కల్పించండి.. ఎవరు దాడులకు పాల్పడినా కుమ్మిలాకప్ లో వెయ్యండి అని అనాలనుకున్నాడట. కానీ పాపం అలా అనలేకపోయాడు. ఎందుకొ తెలుసా..?

పాతబస్తీలో కనిపించిన ప్రతి కార్యకర్తలను చితకబాదిన ఎంఐఎం నాయకుల మీద చర్యలకు కేసీఆర్ ఎందుకు ఆదేశించలేదు అంటే అప్పుడు కేసీఆర్ నోట్లో వేసుకున్నది సెంటర్ ఫ్రెష్. దాంతో నోటికి తాళం పడిందట. పాపం అవతల ఫోన్లో ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు ఏదో చెబుతారు.. యాక్షన్ తీసుకుందామని అనుకున్నారట.. కానీ ఊ...ఊ..ఊ తప్ప వేరే మాట రావడం లేదట. సరే ఫోన్ లో ఏదో ప్రాబ్లం ఉందని.. మరోసారి ఫోన్ చేశాడట.. కానీ కేసీఆర్ మళ్లీ ఊ..ఊ కొట్టి ఫోన్ పెట్టేశారట.

ఎంఐఎం నాయకుల అండదండలతొ ఎంఐఎం కార్యకర్తలు చేసినే దాడులతో పాతబస్తీ వణికిపోయింది. ఎంఐఎం పార్టీ నాయకులు కనిపించిన వేరే పార్టీ కార్యకర్తలను రోడ్ల మీద పరుగెత్తించి.. పరుగెత్తించి కొట్టారు. ఆవేశంతో అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్లు కాంగ్రెస్ నాయకుల మీద చేయి చేసుకున్నా.. తమ కార్యకర్తలు విచక్షణారహతంగా కొడుతున్నా కానీ పోలీసులు మాత్రం కిమ్మనకుండా కూర్చున్నారు. ఎందుకంటే పై నుండి ఎలాంటి ఆదేశాలు రాలేదు. కేసీఆర్ సారు.. మామూలు టైంలో అయితే చందాలు.. పొడుపు కథలు.. సామెతలు చెప్పి మాట గారడీతో అందరికి ఆకర్షిస్తూ.. మాయ చేస్తాడ. కానీ సాతబస్తీ గొడవ గురించి మాత్రం మాట్లాడరు.

అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీలు పోలింగ్ రోజు దాదాపు 200 మంది కార్యకర్తలతో టూ వీలర్స్ మీద అన్ని పోలింగ్ కేంద్రాలు తిరుగుతూ.. ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలను వెంటబడి మరీ కొట్టారు. ఇది ప్రజాస్వామ్య దేశమా అని అనుమానం కలిగేలా.. రౌడీరాజ్యాన్ని కళ్లకు కట్టారు. తమ పార్టీ నాయకుల మీద దాడి చేసినా కానీ కేసీఆర్ మాత్రం ఎందుకు లే అన్నట్లు వ్యవహిరన్తుండటం విశేషం. అయితే అంతకు ముందు ఉన్న పార్టీలు కూడా ఎంఐఎంతో రాజకీయ వ్యవభిచారం చేశాయి. దాంతో ఎంఐఎం పార్టీ మరింత బలంగా తయారైంది. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే చెయ్యబోతున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎంఐఎం పార్టీని పల్లెత్తి మాట కూడా మాట్లాడరు.

అయినా నవ్విన నాప చేనే పండింది అన్నట్లు... తిట్టుకున్నా,... కొట్టుకున్నా మనోడే అన్న భావన వాళ్లకు వాళ్లకు ఉంటే మనకెందుకు..? ఎంఐఎం కార్యకర్తలు తమ పార్టీ నాయకుల మీద , డిప్యూటీ సిఎం  ఇంటి మీద దాడి చేసినా కానీ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా మాట్లాడరు. పోలింగ్ సమయంలో జరిగిన హింస మీద ఓ ముఖ్యమంత్రిగా కూడా స్పందించరు. ఇదంతా నాకెందుకు అని మరోసారి సెంటర్ ఫ్రెష్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే మరోసారి ఎంఐఎం కార్యకర్తలు దాడి చేసినా కూడా ఏమీ మాట్లాడకుండా ఉండేందుకు మిగిలిన మంత్రులకు కూడా కేసీఆర్ సెంటర్ ఫ్రెష్ ఇస్తే బాగుంటుందేమో..?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  GHMC  Polling  GHMC Polling  MIM  AIMIM  Asaduddin Owisi  

Other Articles