Old city only for MIM party

Old city only for mim party

Akbaruddin Owisi, Asaduddin Owisi, MIM, AIMIM, Hyderabad, Old city, GHMC Polls, Case on Owisi brothers, Owisi family

MIM Party leaders Asaduddin Owisi and Akabaruddin Owisi showing their strength. Police filed two cases on Asaduddin and one case on Akbaruddin Owisi.

పాతబస్తీ అసదుద్దీన్ ఓవైసీ అబ్బ జాగీరా..?

Posted: 02/03/2016 02:47 PM IST
Old city only for mim party

తాతలు. తండ్రులు సంపాదించిన ఆస్తులకు ఎలాగైతే వారసులు ఉంటారో అలాగే.. నాయకత్వానికి కూడా వారసులు పుట్టుకువస్తున్నారు. ప్రజల మనిషిగా ఉన్న వ్యక్తుల పుత్రరత్నాలు.. తండ్రి కార్డుతో ఎలక్షన్ లలో పోటీ చేసి గెలుస్తున్నారు. తాతల, తండ్రుల పేరుతో రాజకీయాల్లో ఎంతో మంది అరంగేట్రం చేస్తున్నారు. అయితే అందరూ కాకున్నా చాలా మంది సక్సెస్ ఫుల్ గా ముందుకు దూసుకెళుతున్నారు. అయితే కొంత మంది మాత్రం తమకు వచ్చిన అవకాశాన్ని అడ్డంగా వాడుకుంటున్నారు. కొంత మంది సెంటిమెంట్ ను వాడుకుంటూ... ఆవే:శాలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్నారు. అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే.. ఇలాంటి లక్షణాలున్న ఓ వ్యక్తి, ఓ కుటుంబం గురించి చెబుతున్నా కాబట్టి.

అసదుద్దీన్ ఓవైసీ.. పార్లమెంట్ సభ్యుడు, ఎంఐఎం పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు. ముస్లిం, మైనార్టీలకు అండగా ఓ పార్టీని అసదుద్దీన్ తండ్రికి స్థాపించగా.. ప్రస్తుతం అదే పార్టీకి బాధ్యతవహిస్తున్నాడు. అయితే అసదుద్దీన్ ఓవైసీ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో ప్రత్యక్షంగా కొన్నిసార్లు, పరోక్షంగా చాలా సార్లు ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యమయ్యారు.  అసదుద్దీన్ ఓవైసీ అన్నా.. మజ్లిస్ పార్టీ అన్నా తీవ్ర వ్యతిరేక కొన్ని పార్టీల్లో ఉంది. ముఖ్యంగా బీజేపీ పార్టీకి ఎంఐఎం పార్టీ అంటే అస్సలు నచ్చదు. నాయకుడు అనే వాడు ముందుడి నడిపించే వాడే.. కానీ తగాదాలకు ముందుండే వాడు కాదు. నిన్న జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా అసదుద్దీన్ ప్రవర్తన అచ్చం వీధి రౌడీలా ఉంది. తమ కార్యకర్తలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య గొడవ జరిగింది అని తెలుసుకున్న అసదుద్దీన్ అక్కడికి వచ్చి గొడవను మరింత పెంచారు.

తన ఏరియాలో నీకేంటి పని అంటూ కాంగ్రెస్ నాయకులను బెదిరించే ప్రయత్నం చేశారు. ఇది మా ఏరియా.. మజ్లిస్ ఏరియా.. మీకు ఇక్కడ ఏంటి పని అంటూ గద్దించారు. పోలీసులు ఎంతలా అసదుద్దీన్ ను కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినా కానీ అతడు మాత్రం ఆవేశంతో ఊగిపోయారు. దాంతో అక్కడున్న కార్యకర్తలు కాంగ్రెస్ నాయకుల మీద దాడికి దిగారు. అయితే గతంలో కూడా వేరే పార్టీ నాయకులకు ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. అయితే నిన్న పోలింగ్ సందర్భంగా మీడియా ద్వారా అక్కడి విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంతకు ముందు కూడా ఇలాంటివి చాలానే జరిగాయి.

అసదుద్దీన్ పదే పదే చెప్పే మాట ఒక్కటే.. పాతబస్తీ మాది.. ఇక్కడ ఎవరికీ చోటు లేదు అని. పాతబస్తీ అనే కాదు ఏ ప్రాంతంలో అయినా ఎవరైనా పోటీ చెయ్యొచ్చు. కానీ అసదుద్దీన్, అతడి తమ్ముడ అక్బరుద్దీన్ వల్ల ఎంఐఎం పార్టీ అంటే రౌడీల పార్టీలా మారింది. గొడవలకు వెళ్లడం.. అలా గొడవలకు వెళ్లిన ఎంఐఎం నాయకులను వెంటనే ఓవైసీ సోదరులు బయటకు తీసుకురావడంతో వారికి మరింత బలం చేకూరుతోంది. ప్రజాస్వామ్యం మీద.. రాజ్యాంగం మీద గంటలు గంటలు ఆవేశంగా మాట్లాడే అసదుద్దీన్ స్వయంగా ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నా అడగరాదు.. ఎందుకంటే ప్రజాస్వామ్యం.. అందరికి చోటుంది. అయినా అడిగితే అప్పుడు ముస్లిం కార్డు చూపిస్తారు. మైనార్టీలను ముఖ్యంగా ముస్లింలను రెచ్చగొడుతున్నారని అంటారు. శుక్రవారం రోజు ప్రార్థనలు చేసిన తర్వాత ర్యాలీ తీస్తారు. రాళ్లు వేస్తారు.

మైనార్టీలకు అండగా నిలబడితే మంచిదే కానీ తమ ఏరియాలో ఎవరినీ ఎదుగనివ్వకుండా.. నియంతృత్వం చెయ్యడం మంచిది కాదు. ఎంఐఎం పార్టీ స్థాపించిన అసదుద్దీన్ ఓవైసీ సుల్తాన్ సలాలుద్దీన్ ఓవైసీ ఎంతో మతసామరస్యాన్ని పాటించే వ్యక్తి. పేదలపట్ల ఎంతో దయ ఉన్న వ్యక్తిగా. ప్రజల కష్టాలను తీర్చే నాయకుడిగా పేరుంది. కానీ అసదుద్దీన్ మాత్రం ఎంఐఎం పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీని మరోమలుపు తిప్పారు. ఎంఐఎం పార్టీ మీటింగ్ లను మసీదుల్లో, దర్గాల్లో నిర్వహిస్తారు. ముస్లిం యువకులను రెచ్చగొడతారు అయినా ఎవరూ పట్టించుకోరు.. పైగా పార్లమెంట్ లో మాత్రం ముస్లింలను తొక్కేస్తున్నారు అని బాధపడతారు.

ఇక ఎంఐఎం పార్టీ కానీ అసదుద్దీన్ ఓవైసీ కానీ తమ ఏరియాగా చెబుతున్న పాతబస్తీలో ఏమైనా అభివృద్ది చేశారా అంటే అస్సలు లేదు. పాతబస్తీలోనే బాల కార్మికులు ఎక్కువ.... పాతబస్తీలోనే నిరక్షరాస్యులు ఎక్కువ. అన్నింటికి మించి ఉగ్రవాద కార్యకలాపాలకు హైదరాబాద్ పాతబస్తీ ఎక్కడోచోట లింక్ ఉంటుంది. ముస్లిం కార్డుతో ఎవరిని పడితే వాళ్లను సమర్థిస్తారు. ఉగ్రవాదులను కూడా సమర్థిస్తారు. ఉగ్రవాది వికారుద్దీన్ మీద పెద్దగా రచ్చ చేస్తారు. ఉగ్రవాదికి చావు మీద మతం రంగు పులిమి... యువకులను రెచ్చగొడతారు.

ఇలా అసదుద్దీన్ ఓవైసీ రాజకీయాల కోసం ఎంతైనా దిగజారుతారు. నిన్న అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ల మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. అసదుద్దీన్ మీద రెండు కేసులు, అక్బరుద్దీన్ మీద ఓ కేసు నమోదైంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. రాజకీయ ఉంపుడుగత్తెలు కొంత మంది అక్బరుద్దీన్, అసదుద్దీన్ లాంటి వ్యక్తులకు వత్తాసుపలుకుతున్నారు కాబట్టే వాళ్ల పప్పులు ఉడుకుతున్నాయి. అయితే రెచ్చగొట్టే... మతాన్ని అడ్డం పెట్టుకునే ఓవైసీలాంటి వాళ్లను అడ్డుకునేందుకు పాతబస్తీలాంటి ఏరియాల్లో ప్రజాస్వామ్య పార్టీలు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles